Breaking News

బిగాస్‌తో హితిక మోటార్స్‌ నూతన డీలర్‌షిప్‌…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్‌ఆర్‌ గ్లోబల్‌కు చెందిన బిగాస్‌, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హితిక మోటార్స్‌తో కలిసి తన అత్యాధునిక నూతన అధీకృత డీలర్‌షిప్‌ షోరూమ్‌ను ఆదివారం వరుణ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ వి.ప్రభుకిషోర్‌, వి.లక్ష్మీ కిషోర్‌లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా హితిక మోటార్స్‌, ప్రొప్రయిటర్‌ హర్షవర్థన్‌ మాట్లాడుతూ విజయవాడలో బిగాస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల డీలర్‌షిప్‌ను ప్రారంభించినందుకు మేము చాలా సంతోషిస్తున్నామన్నారు. నానాటికీ పెరుగుతున్న పెట్రోల్‌ ధరల కారణంగా ఈరోజు చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు దృష్టి పెడుతున్నారన్నారు. ఇప్పుడు భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్‌ స్కూటర్లదేనని, మా స్కూటర్‌లను 3 గంటల్లోనే ఛార్జ్‌ చేయవచ్చని, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో, 70 కిలోమీటర్ల వరకు వాహనాన్ని నడపవచ్చన్నారు. దీనిని నడపడం నిర్వహించడం చాలా సులభమని, సున్నా కాలుష్యంతో, పెట్రోల్‌ ఖర్చులపై ఆదా చేయడానికి ఇది అన్ని వయసుల వారికి ఆదర్శంగా వుంటుందని వివరించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే బ్రాండ్‌ యొక్క మొదటి డీలర్‌షిప్‌ కావడం విశేషమని, బిగాస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మోడళ్ళు, బి8 మరియు ఎ2ల గురించి కస్టమర్‌లు తెలుసుకోవడానికి ప్రారంభించిన ఈ షోరూమ్‌ అన్ని ప్రత్యేకతలు కలిగిన ఒక సరికొత్త కేంద్రంగా వర్ణించారు. ప్రీ`బుక్‌ చేసిన ఔత్సాహిక కస్టమర్‌లకు షోరూమ్‌ ప్రారంభమైన మొదటి రోజునే 60 బిగాస్‌ స్కూటర్‌లను డెలివరీ చేసిన ఘనతతో ఒక భారీ మైలురాయిని సృష్టించిందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్‌ ఆర్‌ఆర్‌ గ్లోబల్‌ ఫౌండర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బిగాస్‌ హేమంత్‌ కబ్రా, వరుణ్‌ మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి.వి.సత్యనారాయణ, ట్రాఫిక్‌ ఎసిపీ దామోదర్‌, వరుణ్‌బజాజ్‌ సిబ్బంది, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *