Breaking News

జగనన్న కాలనీల్లో ఆసక్తి చూపుతున్న లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చురుగ్గా చేపట్టడం జరుగుతోంది…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలందరికి ఇళ్ళు పధకం లో భాగంగా లే ఆవుట్ల లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు, కాలనీలు పరిశీలించడం జరిగిందని ఆర్డీవో ఎస్. మల్లిబాబు అన్నారు. ఇంజినీర్లు సూచనలు పాటించి త్వరితగతిన ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలన్నారు. శుక్రవారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి స్థానిక స్పెక్ లే అవుట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, జగనన్న కాలనీల్లో ఆసక్తి చూపుతున్న లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చురుగ్గా చేపట్టడం జరుగుతోందన్నారు. ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,85,000 వేలు అందిస్తోందని తెలిపారు. కొందరు లబ్దిదారులు ఆర్థిక స్థోమత కలిగి ఉండడంతో ఆసక్తి తో మెరుగులతో ఇంటి నిర్మాణం చేపడుతున్నారని పేర్కొన్నారు. కొందరికి రూ.5 లక్షలు వరకీ, అదనపు హంగులు కోసం మరికొంత వెచ్చిస్తున్నారని తెలిపారు. ఇంజనీర్లు సూచనల ను పాటించడం ద్వారా కొంత వ్యయాన్ని తగ్గించ గలుగుతామన్నారు. ఐదు అడుగులు పునాది బదులు రెండున్నర, మూడు అడుగుల పునాది ద్వారా రూ.60 వేలు, సిమెంట్ కిటికీలు, గుమ్మాలు వలన మరో 50 వేలు మేర ఆదా చేసుకోవచ్చు నని మల్లిబాబు తెలిపారు. ఇంటి నిర్మాణాలు చేపడుతున్న లబ్దిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను, సూచనలను తెలుసుకోవడం జరిగినట్లు ఆర్డీవో మల్లిబాబు పేర్కొన్నారు. ఇంటి నిర్మాణాల ను నిర్దేశించిన స్థలంలోనే చేపట్టాలని, అదనపు స్థలంలోకి చొచ్చుకుని వొచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణాలు చేపట్టరాదని సూచించారు. అటువంటి వాటివల్ల భవిష్యత్తు లో డ్రైయిన్స్, రహదారులు, తదితర నిర్మాణాలకు ఆటంకం ఏర్పడి, ఆక్రమణలను తొలగించడం జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచు కోవాలని తెలిపారు. ప్రభుత్వం లబ్దిదారులకి పేదలందరికి స్వంత ఇల్లు కల్పించాలనే సంకల్పన్నీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్డీవో వెంట హౌసింగ్ ఈఈ సీహెచ్. బాబూరావు, హౌసింగ్, మునిసిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *