నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
నూజివీడు డివిజన్ లో ఫిబ్రవరి 4వ తేదీన 63 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. గన్నవరం మండలం లో 10, బాపులపాడులో 8 , నూజివీడు అర్బన్ లో 10 , నూజివీడు రూరల్ లో 4, అగిరిపల్లిలో 3, తిరువూరు లో 9, చాట్రాయి లో 3, విస్సన్నపేటలో 8, పమిడిముక్కలలో 1, ఏ .కొండూరులో 4, ఉంగుటూరు మండలంలో 3 కేసులు నమోదయ్యాయన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సానిటైజెర్ వినియోగించాలని, బహిరంగ ప్రదేశాలలో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. అవసరం లేకుండా బయటకు రావద్దని, కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వంతో సహకరించాలని ఆర్డీఓ రాజ్యలక్ష్మి ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
Prajavartha Online Telugu News