Breaking News

దైవానుగ్రహంతోనే కార్యసిద్ది… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-శ్రీకాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా దిన త్రయ చతుర్వేద పారాయణ మహోత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ సనాతన సంస్కృతికి వేదమే మూలమని.. అటువంటి ప్రాచీన జ్ఞానాన్ని పరిరక్షించడం ప్రతిఒక్కరి కర్తవ్యమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో దిన త్రయ చతుర్వేద పారాయణ మహోత్సవాలు బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ సారథ్యంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలో రాష్ట్ర నలుమూలల నుండి వేద పండితులు పాల్గొని వేద పఠనం చేశారు. కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సును చ‌క్కగా నిర్వహించిన శ్రీ కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ సభ్యులను అభినందించారు. వేద పండితులకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత ప్రాధాన్యతను ఇస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. అనంతరం వేద పఠనం ప్రత్యేకత, దానివల్ల కలిగే శుభాల గురించి వివరించారు. వేదాలను గౌరవించుకునే చోట సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారని పేర్కొన్నారు. ప్రాథమిక గ్రంథాలైన మన వేదాలు, శాస్త్రాలను అధ్యయనం చేయడం ద్వారా వందలాదిమంది పండితులు నేటికీ ఆ సంప్రదాయ జ్ఞానాన్ని సజీవంగా ఉంచుతున్నారన్నారు. వైదిక ధర్మాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని మల్లాది విష్ణు వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే చేతులమీదుగా పలువురు పండితులను సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి, కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ చైర్మన్ కాంచనపల్లి రామచంద్ర రావు, ఆలయ చైర్మన్ కొల్లూరు రామకృష్ణ, ఈవో యడ్లపల్లి సీతారామయ్య, వైఎస్సార్ సీపీ డివిజన్ కోఆర్డినేటర్ దోనేపూడి శ్రీనివాస్, మైలవరపు రాము, కోలవెన్ను కొండ, కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *