
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటుచేసిన రియాస్ ఫిజియోథెరపీ క్లినిక్‌ని నగరంలోని ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్‌రోడ్డులో శుక్రవారం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు చేతుల మీదుగా ప్రారంభించారు. క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ సిహెచ్ కీర్తి, డాక్టర్ రాజాచంద్రకాంత్‌లు మాట్లాడుతూ ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో అనుభవజ్ఞులైన డాక్టర్లచే లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరలతో ఫిజియోథెరపీ వైద్య చికిత్సను అందిస్తున్నామన్నారు. ఫిజియోథెరపీ వైద్యరంగంలో తమకు 12 సంవత్సరాల అనుభవం వుందన్నారు. తమ క్లినిక్‌లో జనరల్ సీజనల్ వ్యాధులకు వైద్యం చేయబడుతుందన్నారు. డాక్టర్ సిహెచ్ కీర్తి మాట్లాడుతూ 8 సంవత్సరాల పాటు సంతానలేమి వున్న మహిళల్లో లోటుపాటులు నివృత్తిచేసిన అనుభవం తమకుందన్నారు. కరోనా బారినుండి బయటపడి సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మేలైన వైద్యం అందిస్తామన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి, లిడ్‌క్యాప్ ఛైర్మన్ కోనేరు సత్యప్రియ, డివిజన్ కార్పొరేటర్ పెనుమత్స శిరీష, క్లినిక్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News