Breaking News

ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ దేవాంగుల కుల రాష్ట్ర అధ్యక్షుడిగా శీలం లెనిన్, నాయీబ్రాహ్మిన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పిఠాపురపు సాంబశివరావు నియామకం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి దేవాంగుల కులానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది శీలం లెనిన్ మరియు నాయీబ్రాహ్మిన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పిఠాపురపు సాంబశివరావు లని నియమించి నియామక పత్రాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఫెడరేషన్లో ప్రతీ బి.సి. కులానికి ప్రాధాన్యత ఉంటుందని ప్రతీకులానికి సంబంధించిన నాయకులు వారివారి కులాలు పడుతున్న ఇబ్బందులతో పాటు ఇతర బి.సి. కులాల ఇబ్బందులని వాటి పరిష్కారదిశగా మిగిలిన కులాల నాయకులని కలుపుకుని ఐక్యమత్యంగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
ఎవరికి ఏసమస్య వచ్చినా తమ ఫెడరేషన్ అండగా ఉంటుందని చెప్పారు.

ఏ ప్రభుత్వం వచ్చినా బి సి లని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఇప్పటికీ బి.సి.లు మునిసిపల్ ఛైర్మన్ల్, నామినేటెడ్ పదవుల్లో ఉన్నచోటకూడా అగ్రకులాల పెత్తనమే రాజ్యమేలుతున్నదని. ఇప్పటికీ అధిక సంఖ్యలో జనాభా కలిగిన కులాలు చట్టసభల్లో అడుగులు పెట్టలేదంటే అగ్రకులాలు బి.సి.లని ఏవిధంగా అనగద్రొక్కుతున్నారో అర్ధమవుతుందని దీనికి పరిష్కారం బి.సి.ల రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుందని గుర్తుచేశారు. బి.సి.ల రాజ్యాధికారం కోసం తమ ఫెడరేషన్ పోరాడటానికి ముందుంటుందని వచ్చేది బిసిల రాజ్యమేనని తెలిపారు.

శీలం లెనిన్ మాట్లాడుతూ దేవాంగుల రాష్ట్ర అధ్యక్షుడు నియమించినందుకు ధన్యవాదాలు తెలిపి కులంలో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఉపాధి లేక కూలీలుగా మారుతున్నారనీ, ఉపాధి చూపించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోని స్థితిలో వుందనీ, ఖచ్చితంగా ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి అడుగుజాడల్లో నడిచి దేవాంగుల హక్కుల కోసం కృషి చేస్తానని తెలిపారు.

పిఠాపురపు సాంబశివరావు మాట్లాడుతూ.. న్యాయీబ్రాహ్మిన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రతీ దేవాలయాల్లో నాయీబ్రాహ్మిన్ న్యాయమైన హక్కులకోసం ఫెడరేషన్ ఛైర్మన్ అండతో పోరాడటానికి కృషిచేస్తానని తెలిపారు.

ఈకార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు, తొగటివీరక్షత్రియ కుల రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, శ్రీధరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *