Breaking News

గుణదల ఆర్వోబీపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షతన సమీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుణదల ప్రాంతంలో బుడమేరు వంతెన వద్ద ఆర్వోబీ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్ లో కలెక్టర్ జె.నివాస్, నగర కమిషనర్ రంజిత్ భాష, జేసీ మాధవీలత, సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్, వీఎంసీ చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్, ఆర్ అండ్ బీ ఎస్ఈ ఆర్. శ్రీనివాస మూర్తితో ఆర్వోబీ నిర్మాణంపై శనివారం సుధీర్ఘ చర్చ జరిపారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఆర్వోబీ వంతెన నిర్మాణ ఆవశ్యకతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించడంతో రూ.23కోట్లు మంజూరు చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. స్టేజ్ 1 పనులు పూర్తి చేసుకుని స్టేజ్ 2 పనులకు టెండర్లను పిలవాలని మంత్రి శంకరనారాయణ దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన కూడా సానుకూలంగా స్పందించారని వివరించారు. కనుక నిర్మాణానికి సంబంధించిన సమస్యలను అధిగమించి అడ్డంకులు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను కోరారు. ఇళ్లు నష్టపోయిన వారికి వెంటనే పునరావాసం కల్పించాలన్నారు. న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే కోర్టులకు సవివరంగా వివరించి అడ్డంకులు తొలగించుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఈ వంతెన పూర్తయితే నగరంలో చాలావరకు ట్రాఫిక్‌ సమస్య తీరుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈఈ ఎన్.కృష్ణ నాయక్, నార్త్ తహసీల్దార్ దుర్గాప్రసాద్, వీఎంసీ, ఆర్&బి మరియు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *