Breaking News

ప్రతిభ కలిగిన ప్రతి క్రీడాకారుడిని ప్రోత్సహిస్తాం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-అట్టహాసంగా ప్రారంభమైన జిల్లా స్థాయి ఫుట్ బాల్ మరియు టేబుల్ టెన్నిస్ లీగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో క్రీడారంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఎం.జి.రోడ్డులోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఫుట్ బాల్ మరియు టేబుల్ టెన్నిస్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జ్యోతి ప్రజ్వలన చేసి గౌరవ శాసనసభ్యులు పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టేబుల్ టెన్నీస్ ఆడి క్రీడాకారులతో ఉత్తేజాన్ని నింపారు. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయని మల్లాది విష్ణు అన్నారు. మన వద్ద అందుబాటులో ఉన్న ప్రతిభను గుర్తిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే సూపర్‌ పవర్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కనుక యువత పట్టుదలతో రాణించి రాష్ట్ర ఖ్యాతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటాలని ఆకాంక్షించారు. క్రీడలతో శారీరక ధారుఢ్యం, మానసిక ఉల్లాసంతో పాటు స్నేహపూరిత వాతావరణం పెంపొందుతుందని మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యంగా క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చుననే సంకల్పాన్ని ప్రతిఒక్కరూ అలవరచుకోవాలన్నారు. పోటీలలో గెలుపు ఓటములు సహజమని, ఓడిన క్రీడాకారులు మరింత పట్టుదలతో కృషి చేస్తే విజేతలుగా నిలుస్తారని పేర్కొన్నారు. యువత క్రీడల్లో రాణించేలా తర్ఫీదునిచ్చేందుకు ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 20కిపైగా క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మల్లాది విష్ణు తెలిపారు. నగరంలోని పలు స్టేడియంలను, క్రీడా మైదానాలను ఇప్పటికే ఆధునికీకరించినట్లు వెల్లడించారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు, క్రీడా సంఘాలు వారిని ప్రోత్సహించాలని సూచించారు. ఎందరో క్రీడాకారులకు పుట్టినిట్లు అయిన విజయవాడ నగరాన్ని క్రీడారాజధానిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. కార్యక్రమానికి DSDO శ్రీనివాసరావు, DSA కృష్ణ అధ్యక్షత వహించగా.. స్థానిక వైసీపీ కార్పొరేటర్ కుక్కల అనిత, ఫుట్ బాల్ కోచ్ పి.రవికుమార్, టేబుల్ టెన్నీస్ కోచ్ SK.ముంతాజ్ బేగం, రిటైర్డ్ DSDO సుధాకర్, క్రీడాకారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *