-గ్లూ థెరపీ, లేజర్ టెక్నాలజీలతో సులభంగా ఉపశమనం
-మచ్చలు, నొప్పి లేకుండా ఉబ్బు సిరల సమస్యకు పరిష్కారం
-ప్రఖ్యాత ఎండో వాస్క్యులర్ సర్జన్, డయాబెటిక్ ఫుట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె. సంజీవ్ రావ్
-నగర ప్రజల కోసం చరితశ్రీ హాస్పిటల్లో అందుబాటులో..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేరికోస్ వెయిన్స్‌కు సంబంధించిన అధునాతన వైద్య సేవలు నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రఖ్యాత ఎండో వాస్క్యులర్ సర్జన్, డయాబెటిక్ ఫుట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె. సంజీవ్ రావ్ నగరంలోని చరితశ్రీ హాస్పిటల్ నందు ప్రతి శనివారం నిర్వహించే ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా సేవలందిస్తారు. సూర్యారావుపేట నక్కలరోడ్డులోని చరితశ్రీ హాస్పిటల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సంజీవ్ రావు మాట్లాడుతూ.. కాళ్లలోని సిరలు అసాధారణంగా ఉబ్బిపోవడాన్ని వేరికోస్ వెయిన్స్ అంటారని, ఈ వ్యాధి 30-70 ఏళ్ళ వయసు వారిలో ఎక్కువగా కనపడుతుందని, మహిళల్లో ఎక్కువగా ఈ సమస్య ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. వేరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడేవారిలో కాళ్లలో నొప్పి, కాళ్లు బరువెక్కిన భావన, కాళ్ల మంటలు, కండరాలు బిగుసుకుపోవడం, ఎక్కువసేపు కూర్చున్నా, నిలబడినా నొప్పి మరింత తీవ్రమవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. ఏదైనా సిర లేదా సిరల చుట్టూ దురద పుట్టి చర్మపు రంగు మారి పుండ్లు ఏర్పడతాయని వివరించారు. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. వేరికోస్ వెయిన్స్ అనేది ప్రోగ్రసివ్, ఇర్రివర్సబుల్ వ్యాధి కాబట్టి మందులతో నయం చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. వేరికోస్ వెయిన్స్‌కు అద్భుతమైన చికిత్స అందుబాటులోకి వచ్చాయని, అత్యాధునిక గ్లూ థెరపీ, లేజర్ టెక్నాలజీ చికిత్సలతో ఏ విధమైన మచ్చలు గానీ, నొప్పి గానీ, విశ్రాంతి అవసరం లేకుండా వేరికోస్ వెయిన్స్ సమస్యకు సులభంగా పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అడ్వాన్స్డ్ గ్లూ థెరపీ ద్వారా వేరికోస్ వెయిన్స్ సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుందని అన్నారు. హాస్పిటల్లో చేరాల్సిన అవసరం కూడా ఉండదని, చికిత్స పూర్తయిన తర్వాత కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే పేషేంట్ సాధారణంగా లేచి నడవగలుగుతారని తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స అందిస్తే వేరికోస్ వెయిన్స్ను త్వరితగతిన నివారించవచ్చని అన్నారు. తొలుత చర్మ సమస్యగా భావించి, నొప్పి, పుండ్లు రాగానే ఆందోళనకు గురువుతారని, తాము అందించే ఆధునిక చికిత్సలతో ఎటువంటి భయం లేకుండా వేరికోస్ వెయిన్స్ సమస్యను సులువుగా పరిష్కరించుకోవచ్చన్నారు. ఉబ్బు నరాల సమస్యతో పాటు, షుగర్ వల్ల వచ్చే పుండ్లు, రక్తప్రసరణ తగ్గడం, రక్తం గడ్డకట్టడం, బోధకాళ్లు, ఎవి ఫిస్టులా సమస్యలకు చికిత్సలు, డయాలసిస్ సేవలను అందిస్తున్నామని వెల్లడించారు. చరితశ్రీ హాస్పిటల్ నందు ప్రతి మొదటి, మూడో శనివారాల్లో తాము అందుబాటులో ఉంటామని డాక్టర్ సంజీవ్ రావు పేర్కొన్నారు. ఈ శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాలకు 9989870010 నంబర్ లో సంప్రదించాలని సూచించారు. తొలుత రిజిస్ట్రేషన్ చేయించుకున్న 20 మందికి కన్సల్టేషన్ తో పాటు, రూ. 5 వేల విలువైన ఏవీ స్కాన్, ఏబీఐ, టీబీఐ, డాప్లర్, ఆర్టియల్ ఏజ్ పరీక్షలను ఉచితంగా అందిస్తున్నట్లు డాక్టర్ సంజీవ్ రావు ప్రకటించారు.
Prajavartha Online Telugu News