Breaking News

ప్రసూతి వైద్యంలో సంచలనం…


-రాష్ట్రంలో తొలిసారిగా వాటర్ బర్త్ డెలివరీ
-చరిత్ర సృష్టించిన *అను మై బేబీ* వైద్యులు
-ప్రత్యేకమైన నీటితొట్టిలో సహజసిద్ధ ప్రసవం
-వాటర్ బర్త్ డెలివరీతో ఎన్నో ప్రయోజనాలు
-అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జి. రమేష్, ఎండీ డాక్టర్ జి. శ్రీదేవి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రసూతి వైద్యంలో అను మై బేబీ వైద్య నిపుణులు సంచలనం సృష్టించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వాటర్ బర్త్ డెలివరీని విజయవంతంగా పూర్తి చేసి కొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను స్థానికంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారు.. గర్భిణీలు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం అత్యాధునిక సదుపాయాలతో ‘అను మై బేబీ’ హాస్పిటల్ ను నెలకొల్పిన సంగతి తెలిసిందే. పలు సంక్లిష్టమైన కేసుల్లో సమర్ధవంతంగా చికిత్సనందించిన అను మై బేబీ వైద్యులు అత్యాధునికమైన వాటర్ బర్త్ డెలివరీని విజయవంతంగా పూర్తిచేశారు. వాటర్ బర్త్ డెలివరీ గురించి తెలియజేసేందుకు అను మై బేబీ హాస్పిటల్లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ జి. రమేష్, ఎండీ డాక్టర్ జి. శ్రీదేవి పాల్గొని రాష్ట్రంలోనే తొలిసారిగా వాటర్ బర్త్ డెలివరీ నిర్వహించినందుకు అను మై బేబీ వైద్య బృందాన్ని ప్రశంసించారు. ఆధునిక వైద్య సేవలను ప్రజలందరికీ చేరువ చేసేలా అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ పనిచేస్తోందని, ఆ క్రమంలోనే ఆరుగురు ప్రఖ్యాత గైనకాలజిస్టులతో అను మై బీ హాస్పిటల్ ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ పావని మాణిక్య, డాక్టర్ కవిత బత్తుల మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా కారంపూడికి చెందిన మహిళ వాటర్ బర్త్ డెలివరీ ద్వారా ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు జన్మనిచ్చారని తెలిపారు. ప్రత్యేకమైన నీటితొట్టిలో నిర్వహించే ఈ ప్రక్రియ అత్యంత ఆధునికమైనదని, సహజసిద్ధమైన రీతిలో నిర్వహించే ఈ ప్రక్రియ తల్లీబిడ్డలిరువురికీ అత్యంత సురక్షితమైనదని పేర్కొన్నారు. వాటర్ బర్త్ డెలివరీతో అనేక ప్రయోజనాలున్నాయని డాక్టర్ పావని మాణిక్య వివరించారు. ప్రసవ వ్యవధి గణనీయంగా తగ్గుతుందని, నొప్పి తీవ్రత చాలా వరకు తగ్గుతుందని చెప్పారు. తల్లిగర్భంలో ఉమ్మనీటిలో వున్నట్లుగా, నిర్ధిష్ట ఉష్ణోగ్రత కలిగిన నీటిలో ప్రసవ ప్రక్రియను నిర్వహిస్తామని, పూర్తి సహజసిద్ధమైన ఈ విధానం ద్వారా శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటుందని వివరించారు. అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యులు, సుశిక్షితులైన వైద్య సిబ్బంది, అత్యున్నత సాంకేతిక సదుపాయాల సహకారంతో వాటర్ బర్త్ డెలివరీని విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. వాటర్ బర్త్ డెలివరీ కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నామని.. ఈ ప్రక్రియ ద్వారా ప్రసవం జరిపేందుకు గర్భిణీ శరీర బరువు సాధారణ స్థాయిలో ఉండాలని, బీపీ, షుగర్ సమస్యలు లేకుండా ఉండాలని, నెలలు నిండి డెలివరీ సమయం సమీపించిన వారికి మాత్రమే వాటర్ బర్త్ డెలివరీ నిర్వహిస్తామని అన్నారు. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ వాటర్ బర్త్ డెలివరీని పూర్తిచేసినట్లు డాక్టర్ పావని తెలియజేశారు. గర్భిణీలు, నవజాత శిశువుల కోసం అను మై బేబీ హాస్పిటల్ నందు విస్తృత శ్రేణి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆమె అన్నారు. వాటర్ బర్త్ డెలివరీతో పాటు, ప్రసవాల కోసం టెన్స్ అనే అత్యాధునిక విధానం అను మై బేబీలో అందుబాటులో ఉందని ప్రకటించారు. నర్వ్ సిమ్యులేషన్ విధానంలో నిర్వహించే టెన్స్ డెలివరీతో లేబర్ పెయిన్స్ ను నియంత్రించి, సుఖ ప్రసవం అయ్యేలా చేయవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అను మై బేబీ వైద్యులు డాక్టర్ ఎన్. మాధురి, డాక్టర్ పి. మంజు డాక్టర్ పి. రమ్య, డాక్టర్ ఈ. సుకీర్తి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *