Breaking News

పంచాయతీని ఆదర్శంగా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలి… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాభివృద్ధికి సర్పంచ్లు నిరంతరం కృషి చేయాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ గ్రామ పంచాయతీని ఆదర్శంగా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఆశాభావం వ్యక్తం చేశారు.
శనివారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొని అనేక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
తొలుత మచిలీపట్నం మండల పరిధిలోని పెదపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్ గడదేశి అనూషా డేవిడ్ దంపతులు , తాము సర్పంచిగా ఏడాది కాలం పూర్తి చేసుకొన్ననేపథ్యంలో తమకు అవకాశం కల్పించిన మంత్రి పేర్ని నానికి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఈ ఏడాది కాలంలో గ్రామ అభివృద్ధికి సహకరించిన అధికారులకు, పంచాయతీ పాలకవర్గ సభ్యులకు, ప్రజలందరికీ ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయాలని సూచించారు. గ్రామాల్లో నిత్యం ఎదో ఒక సమస్య ప్రజలను వేధిస్తుంటుందని ఆ సమస్య పరిష్కారానికి ప్రజలు నేతల చుట్టూ తిరుగుతారన్నారు. పెద్ద సమస్య అయితే.. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నేతల వద్దకు తమ గోడు వెళ్లబోసుకుంటారని కానీ చిన్నచిన్న సమస్యలు స్థానికంగా ఉండే తమ సర్పంచికి వివరించి.. పరిష్కారం అయ్యేలా కృషి చేయమని అభ్యర్ధిస్తారు. గ్రామాల్లో చాలా పనులు పంచాయతీ, సర్పంచి చేయాల్సినవే ఉంటాయని అందరికి సహకారంతో వీధి దీపాల దగ్గర్నుంచి.. నీటి కుళాయిలు, పారిశుద్ధ్య నిర్వహణ వరకు అన్నీ తానై సర్పంచి చూసుకోవాలన్నారు.
స్థానిక ఇంగ్లీష్ పాలెంకు చెందిన ఉప్పుగండ్ల పద్మావతి అనే మహిళ తాను గత 15 ఏళ్లుగా ఒక బడ్డీ కొట్టు పెట్టుకొని జీవిస్తున్నానని తన దుకాణంలోకి విద్యుత్ సౌకర్యం కల్పించే విధంగా సహాయం చేయమని కోరింది.
స్థానిక సర్కారుతోటకు చెందిన సుందరి అనే మహిళ తన కష్టాన్ని చెప్పుకొంది.ఎనిమిది నెలల క్రితం తన భర్త శ్రీనివసరావు ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహించారని ఆయనకు కోవిడ్ సోకడంతో ఆరోగ్యం పాడై కొద్దిరోజులు సెలవులు పెట్టారని దాంతో ఉద్యోగం నుంచి తొలగించారని దాంతో తన కుటుంబం ఆర్ధికంగా ఎంతో ఇబ్బందులు పడుతుందని తమపై దయ ఉంచి సహాయం చేయాలని ఆ మహిళ మంత్రికి విన్నవించింది.
స్థానిక బైపాస్ రోడ్డు ప్రాంతానికి చెందిన మురుగుడు హేమలత అనే మహిళ తన సమస్యను తెలిపింది. తన కుమార్తె ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుందని ఫీజు 60 వేలు కట్టాలని యాజమాన్యం వత్తిడి తెస్తుందని తమరు గతంలో పాప ఫీజు విషయంలో కళాశాల మేనేజిమెంట్ తో మాట్లాడారని దాంతో వారు 20 వేల రూపాయలు తగ్గించారని, ఈసారి సైతం అదే విధమైన సహాయం చేయాలని కోరింది.
స్థానిక రాజుపేటకు చెందిన బీబీ జాన్ అనే వృద్ధురాలు మంత్రికి తన పింఛన్ నిలిచిపోయినట్లు తెలిపింది. ఈ సమస్యపై స్పందించిన ఆయన ఆ వృద్ధురాలితో మాట్లాడుతూ, ఆధార్ కార్డును పరిశీలించి మార్చి 2021 లో ఆధార్ కార్డు రీ ప్రింట్ తీశారని చెప్పారు. ఈ విషయమై ఒకసారి మీ సచివాలయం వద్ధకు వెళ్లి తనకు పింఛన్ ఎందుకు ఆగిపోయిందో మీ వాలింటిరును అడిగి తెలుసుకోవాలన్నారు.
తమ కానూరు గ్రామం కొత్తూరు ప్రాంతంలో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు జరిపేందుకు వల్లకాటికి వెళ్ళే మార్గం ఎంతో ఇబ్బందిగా తయారైందని తమ సమస్య దయతో పరిష్కరించాలని గణాబత్తుల సత్యనారాయణ, మురళి తదితరులు అభ్యర్ధించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *