మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని ఆదివారం మంత్రి కార్యాలయం వద్దకు వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండ గుప్తం గ్రామంలో పదేళ్ల క్రితం కొంత భూమి కొని గతంలోనే విక్రయించగా మిగిలిన 80 సెంట్ల భూమి అక్కడివారు ఆక్రమించారని తమ వద్ద ఆ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పట్టాదార్ పాస్ పుస్తకం కూడా ఉన్నాయని, సమస్య పరిష్కరించాలని విజయవాడ లో నివాసముంటున్న కే ప్రసాద్ అనే వ్యక్తి మంత్రిని కలిసి తన సమస్యను వివరించగా మంత్రి వెంటనే స్పందించి నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యుని తో ఫోన్లో మాట్లాడి వీరి సమస్య పరిష్కారానికి వారిని కలవాల్సిందిగా సూచించారు. బందరు మండలం కానూరు గ్రామంలో వాటర్ ప్లాంట్ కు త్రి ఫేస్ కరెంటు సౌకర్యం కల్పించాలని గ్రామ సర్పంచ్ లక్ష్మి ఉప సర్పంచ్ మురళీమోహన్ తదితరులు మంత్రిని కలిసి విన్నవించగా విన్నవించగా విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు మచిలీపట్నం నుండి మొవ్వకు రాత్రి 8 దాటితే బస్సు లేదని, నైట్ హాల్ట్ బస్సు ఏర్పాటు చేయించాలని బాబ్జి రెడ్డి శ్రీనివాసరెడ్డి లు కోరగా మంత్రి వెంటనే డిపో మేనేజర్తో ఫోన్లో మాట్లాడి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రు.2.25 లక్షల అంచనా వ్యయంతో నిజాంపేటలో పైప్ లైన్ ఏర్పాటు పనులు ప్రారంభించిన మంత్రి పేర్ని వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని, మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబులతో కలసి ఆదివారం స్థానిక 48వ డివిజన్ నిజాంపేటలో వనవలమ్మ టెంపుల్ రోడ్డులో రు. 2.25 లక్షల అంచనా వ్యయంతో త్రాగునీటి పైప్లైన్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రజల తాగునీటి సమస్యలు స్థానిక కార్పొరేటర్ ముచ్చర్ల శైలజ తన దృష్టికి తెచ్చారని అన్నారు సమస్య పరిష్కారానికి రు.2.25 లక్షలతో పాత పైపులైను మార్చి కొత్త పైప్లైన్ వేయుటకు ఈరోజు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం మంత్రి వార్డులో పర్యటించా గా ప్రజలు మంత్రిని కలిసి వార్డులో రోడ్లు డ్రైన్లు అభివృద్ధి చేయాలని కోరారు
బలరాముని పేట వినాయకుడి గుడి సెంటర్ నుండి వనవలమ్మ గుడి వరకు రోడ్డు డౌన్లో ఉండి డ్రైనేజీ నీళ్లు రోడ్లపైకి వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అభివృద్ధి చేయాలని కోరగా మెరక చేసి రోడ్డు కొత్తగా నిర్మించుటకు ఇప్పటికే కొంత రహదారి మంజూరు కాగా, మిగతా రహదారి కూడా అంచనాలు రూపొందించి అభివృద్ధి చేస్తామని అన్నారు వార్డులో మిగతా డ్రైన్లు, కల్వర్టు అభివృద్ధికి అంచనాలు రూపొందించాలని మంత్రి మున్సిపల్ అధికారులను కోరారు. స్థానిక కార్పొరేటర్లు ముచ్చెర్ల శైలజ, చిటికిన నాగేశ్వరరావు, మున్సిపల్ డి ఈ వెంకటరమణ, ఏ ఈ వరప్రసాద్, స్థానిక నాయకులు చందు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News