Breaking News

జిల్లాకు చెందిన విద్యార్థులు క్షేమం…

-స్వస్థలాలకు ఇద్దరిని క్షేమంగా చేర్చాం…
-ముంబైకి చేరుకున్న మరో 8 మంది…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఉక్రెయిన్ లో జిల్లాకు చెందిన 112మంది వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లడం జరిగింది అన్నారు. వీరిలో 108 మంది విద్యార్థులు ఎప్పటికప్పుడు తమతో సంప్రదిస్తున్నారన్నారు. వీరిలో మిగిలిన నలుగురు విద్యార్థులకు సంబంధించిన మొబైల్ ఫోన్లు పనిచేయకపోవడంతో అందుబాటులోకి రాలేదన్నారు. ఇద్దరు వైద్య విద్యార్థులు క్షేమంగా చేరారని, వీరిలో నగరానికి చెందిన వారు ఒకరు కాగా, మరొకరు గుడ్లవల్లేరుకు చెందిన వారని కలెక్టర్ అన్నారు మరో 8మంది విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి ముంబైకి చేరుకున్నారని, రేపటి లోగా వారు స్వస్థలాలకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న జిల్లా విద్యార్థులను క్షేమంగా తిరిగి స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు జిల్లాకు చెందిన మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి నాని,వెలంపల్లి శ్రీనివాసరావులు ఎప్పటికప్పుడు ఢిల్లీలోని ఏపీ భవన్ ను సంప్రదిస్తున్నారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయా మండల తహాసిల్దార్లు ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ తగు సమాచారాన్ని అందిస్తున్నారని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. విద్యార్థులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ జె. నివాస్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *