విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ రోగులకు సేవలందించే ఫ్రంట్ లైన్ వారియర్స్ కు రక్షణ కల్పించే మెడికల్ సామాగ్రి అందించడం అభినందనీయమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుహాసిని అన్నారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వి గార్డ్ ఫౌండేషన్, కొచ్చి ఆధ్వర్యంలో రూ.3.50 లక్షల విలువైన ఎన్ 95 మాస్క్, సర్జికల్ మాస్కులు, పిపిఇ కిట్స్, శానిటైజర్ లను డి ఎం హెచ్ ఓ డా. ఎం.సుహాసినికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కనెక్ట్ టు ఆంధ్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ అమరావతి సీఈవో కోటేశ్వరమ్మ ద్వారా వి గార్డ్ ఫౌండేషన్ కొచ్చి మెడికల్ కిట్స్ అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వి. గార్డ్ ఫౌండేషన్ ప్రతినిధి రాజేష్ ఉన్నారు.
Prajavartha Online Telugu News