Breaking News

విజయవాడలో మార్చి 18 వరకు ” జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ” నిర్వహణ….

-జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనలో 17 రాష్ట్రాలకు చెందిన 109 ఎగ్జి బిషన్ స్టాల్స్ ఏర్పాటు..
-ఈ ఎగ్జి బిషన్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేనేత వస్త్రాలు ప్రదర్శనకు సిద్ధం..
-రాష్ట్రంలో ” నేతన్న నేస్తం ” ద్వారా 2 లక్షల 40వేల కుటుంబాలకు రూ. 576 కోట్లు అందించాం..
-జెడ్ పి చైర్మన్ ఉప్పాల హారిక
-విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు వర్ధన్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
సంస్కృతీ, సంప్రదాయాలను ఆధునిక జీవన శైలిని ప్రతిబింబించే చేనేత వస్త్రాలను ప్రోత్సహించ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు.
విజయవాడ ఏ-ప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో శుక్రవారం చేనేత మరియు జౌళి శాఖ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేనేత అభివృద్ధి కమీషనర్ భారత ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ చేనేత కళాకారుల సంక్షేమ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న ” జాతీయ చేనేత వస్త్ర కళా ప్రదర్శన – 2022 ” ను విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్ తో కలిసి జెడ్ పి చైర్ పర్సన్ ఉప్పాల హారిక ప్రారంభించారు. ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ భారత దేశం కళలకు పుట్టినిల్లు అని ఈ కళలలో చేనేత కళ ముఖ్యమైనదని ఆమె అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుండే చేనేత కళ అభివృద్ధిలో ఉందని, అగ్గిపెట్టె లో చీరను పెట్టి అందించిన ఘనత మన చేనేత కార్మికులదేనని ఆమె అన్నారు. పురాతనమైన చేనేత కళను ప్రతిఒక్కరూ ప్రోత్సహించడం ద్వారా చేనేత కార్మికుల జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుందని హారిక అన్నారు. స్వాతంత్రోద్యమ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమంలో జాతి పిత మహాత్మా గాంధీ నూలు వడికే వారని చేనేత వస్త్రాలకు అంత ప్రాధాన్యత ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ” నేతన్న నేస్తం ” ద్వారా చేనేత కార్మికులకు ఆర్ధిక సహాయం అందిస్తుండడంతో పాటు మద్దతు ధర కల్పించారన్నారు.రాష్ట్రంలో నేతన్న నేస్తం ద్వారా 2 లక్షల 40 వేళా కుటుంబాలకు రూ. 576 కోట్లు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించిందన్నారు. నేత కార్మికులను అన్ని విధాలా ఆదుకునేందుకు అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారన్నారు. విజయవాడలో ఈరోజు నుండి 18 వరకు నిర్వహించే ఈ వస్త్ర ప్రదర్శనను ప్రతి ఒక్కరూ సందర్శించి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని జిల్లా పరిషత్తు చైర్మన్ హారిక కోరారు.
విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు వర్ధన్ మాట్లాడుతూ దేశ ఆర్ధిక వ్యవస్థలో వ్యవసాయం తరువాత చేనేత రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని, 65 లక్షల మంది పైగా చేనేత రంగంలో ఉపాధి పొందుతున్నారన్నారు. భారత దేశ వారసత్వ సంపదలో చేనేత కూడా ఒక భాగమని అయన అన్నారు. పురాతన కాలం నుండి ఆంధ్ర ప్రదేశ్ చేతితో చేసిన వస్త్రాలకు ప్రసిద్ధి చెందిందని, సహకార మరియు సహకారేతర రంగాలలో దాదాపు లక్షా 50 వేల కుటుంబాలు ఉన్నాయన్నారు. ఈ పరిశ్రమకు ఎటువంటి అధికారిక రక్షణ లేకుండా ఒక తరం నుండి మరొక తరానికి చేనేత అందించబడుతుందన్నారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో ఈనెల 4వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహించే జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనలో దేశంలోని మన రాష్ట్రంతో పాటు 17 రాష్ట్రాలకు చెందిన చేనేత ఉత్పత్తులను ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెంలంగాణా, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, ఒరిస్సా, జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, పాండిచ్చేరి, హర్యానా, బీహార్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ప్రసిద్ధి చెందిన చేనేత ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు అమ్మకాలను నిర్వహిస్తారని మల్లాది విష్ణు అన్నారు.
చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ ఎమ్. నాగేశ్వర రావు మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో మొత్తం 109 ఎగ్జి బిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశామని, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు 17 రాష్ట్రాలకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేనేత ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో అమ్మకలకు సిద్ధంగా ఉంచారన్నారు. ధర్మవరం, గద్వాల్, పోచంపల్లి, వేంకటగిరి, బందరుపేటు, పుల్లంపేట, పులగుర్త, మాధవరం కాటన్ చీరలు, టసర్ సిల్క్ చీరలు, పట్టు చీరలు, గొల్లభామ చీరలు సందర్శకులను ఆకర్షిస్తాయన్నారు. వీటితో పాటు శాలువాలు, దోవతులు, లుంగీలు, మంగళగిరి చీరలు, డ్రెస్ మెటీరియల్స్ ను ప్రదర్శిస్తున్నారన్నారు. పెద్దాపురం కాటన్ సిల్క్, పొందూరు కాటన్ షర్టింగ్ డిజైన్ బెడ్ షీట్లు, వరంగల్ డర్రీలు మరియు డోర్ మాట్స్ మరియు ఇతర అనేక రకమైన చేనేత వస్త్రాలు చూపరులకు ప్రదర్శనలో ఉంచామన్నారు.
ఈ ప్రదర్శన ప్రతి రోజు ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ప్రజలందరూ ఈ ప్రదర్శనను తిలకించి వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్ టి సి రీజియన్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి, రాష్ట్ర దేవాంగుల కార్పొరేషన్ చైర్మన్ బి. సురేంద్ర బాబు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ మారు శివ రామకృష్ణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ చేనేత మరియు జౌళి శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్, జాయింట్ డైరెక్టర్ శ్రీ ఎమ్. నాగేశ్వర రావు, కె. కన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *