-జాతీయ చేనేత ప్రదర్శనను సందర్శించిన శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్
-ఉత్పత్తిదారులే అమ్మకందారులుగా చేనేత వస్త్రాల విక్రయం : ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మెహనరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువత చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్లు కావాలని ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త, శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్ అన్నారు. నేటి యువత ప్రోత్సాహంతోనే చేనేత రంగం మరింత శోభను సంతరించుకుంటుదని, వారి ఆలోచనలకు అవసరమైన ఆధునిక ఉత్పత్తులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని వివరించారు. విజయవాడలో మొగల్రాజపురం ఏ-ప్లస్ కన్వెన్షన్ నందు ప్రారంభమైన జాతీయ చేనేత ప్రదర్శన ను ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషులతో కలసి సందర్శించారు. ఈ నెల 18వ తేదీ వరకు చేనేత వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం జరగనుంది. ఈ సందర్భంగా తలశిల మాట్లాడుతూ చేనేత కార్మికుల ఆర్ధిక స్వావలంబన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రవేశ పెట్టిన చేనేత నేస్తం విజయవంతంగా అమలవుతుందన్నారు.
ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మాట్లాడుతూ నేతన్నలు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే విధంగా ఈ జాతీయ స్దాయి ప్రదర్శనకు రూపకల్పన జరిగిందని, ఫలితంగా ఉత్పత్తి ధరలకే అమ్మకాలు సాధ్యమవుతాయని అన్నారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేఘు మాట్లాడుతూ 19 రాష్టాల కు చెందిన చేనేత ఉత్పత్తులు ఒకే చోట లభించటం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆప్కో స్టాల్ ను ప్రత్యేకంగా సందర్శించిన నేతలు మన్నిక కల ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులో ఉంచారన్నారు. రెండో రోజు ప్రదర్శన నేపధ్యంలో చేనేత ప్రేమికులు అయా రాష్ట్రాల స్టాల్స్ ను సందర్శించి నూతన డిజైన్లు అందుబాటులో ఉంచారంటూ నిర్వాహకులను ప్రశంసించారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ అదనపు సంచాలకులు శ్రీకాంత్ ప్రభాకర్, సంయిక్త సంచాలకులు మైసూర్ నాగేశ్వరరావు, కన్నబాబు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News