Breaking News

విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సూచనల మేరకు ఆకస్మికంగా తనిఖీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డైరెక్టర్ జనరల్ (V&E) & ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ (విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్) డిపార్ట్‌మెంట్, డా. శంఖ బ్రతా బాగ్చి, IPS, విజయవాడ యూనిట్‌లోని విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సూచనల మేరకు ఆదివారం విజయవాడ ప్రాంతీయ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి  టి.కనకరాజు ఆధ్వర్యంలో పౌరసరఫరాలు మరియు లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులతో కలిసి 5 బృందాలుగా ఏర్పడి ఎడిబుల్ ఆయిల్, ఆయిల్ సీడ్ హోల్‌సేలర్ & రిటైలర్ డీలర్ అవుట్‌లెట్‌లు, సూపర్ మార్కెట్లు మొదలైన వాటిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయవాడ సిటీ, విజయవాడ రూరల్‌లోని గొల్లపూడి, కృష్ణా జిల్లా పెనమలూరు(మండలం), ఆగిరిపల్లి, పోరంకి ప్రాంతాల్లో లో చమురు, పప్పుల ధరలు, స్టాక్‌లు, ప్యాకేజీలను తనిఖీ చేశారు. కృష్ణా జిల్లాలో బ్లాక్‌ మార్కెటింగ్‌, నూనెలు, పప్పుల అక్రమ నిల్వలను అరికట్టేందుకు ఈ తనిఖీలు జరపడమైనది. సదరు తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, భవిష్యత్తులో కూడా అన్ని నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ఇదే తరహా ఆకస్మిక తనిఖీలు జరపడం జరుగుతుందని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *