Breaking News

మలబార్ సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయం : సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సామాజిక కార్యక్రమాలకు స్వంచ్చంద సంస్థలు ముందుకు రావాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మలబార్ సామాజిక కార్యక్రమాలు అభినంధనీయమని విజయవాడ సెంట్రల్ ఎమ్మల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం పి బి సిద్దార్థ కాలేజీ లో మలబార్ గోల్డ్ ఆండ్ డైమడ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు స్కాలర్షిప్పులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. మలబార్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ స్కాలర్షిప్పులు అందుకున్నారు. ఈ కార్యక్రమానక ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ దినోత్సవం సందర్భంగా విద్యార్దునులకు ఉపకార వేతనాలు అందచేసినందుకు అభినందించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యతోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఉందని విద్య లో మొదటి స్ధానంలో నిలపాలని కె.జి.నుండి పీజి వరకు జగనన్న విద్య దివేన,అమ్మ ఒడి లాంటి పథకాలు ఇస్తున్నారని అన్నారు. పథకాలు అందని వారు సచివాలయంలో సంప్రదించాలన్నారు. అనంతరం విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహీళా దినోత్సవం సందర్భంగా విద్యార్థునులకు ఉపకార వేతనాలు అందచేసిన మలబార్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ప్రతిభ ఆధారంగా 390 మందికి పైగా విద్యార్థునులకు ఎమ్మెల్యే విష్ణు,నగర మేయర్ భాగ్యలక్ష్మి చేతులమీదగా 36,58,000 / – రూపాయల స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేశారు.
ఆడపిల్లలకు ఉపకార వేతనాలు పంపింణి చేయడం సంతోషం కలుగుతుంని అన్నారు. ఆడపిల్లల పట్ల వివక్ష కూడదని ఆడపిల్లలు బాగ చదవగలని మచిలీపట్నం లేడి అప్తిల్ కళాశాల విద్యర్ధిని సింధుర అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,500 మంది పేద విద్యార్థినులను ఎంపిక చేసి రూ 8,000 / – నుండి 10,000 / – వరకు స్కాలర్షిప్పులు అందిస్తామని ఈ సందర్భంగా మలబార్ గ్రూపు ప్రకటించింది . మలబార్ గ్రూప్ యొక్క నిబద్ధతలో భాగంగా , సామాజిక సేవ కార్యక్రమాలకు , దాతృత్వ కార్యకలాపాలకు, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లాభాలలో 5 % ఈ ప్రాంతంలో ఖర్చుపెడుతుంది . మలబార్ గ్రూపు సామాజిక సేవ కార్యక్రమాల్లో ముఖ్యంగా గృహ నిర్మాణం , వైద్య సహాయం, పర్యావరణ పరిరక్షణ ఖర్చు పెడుతున్నామని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఇతర స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు మలబార్ జోనల్ హెడ్ హెడ్ నిఖిల్ చంద్రన్, గుంటూరు స్టోర్ హెడ్ నసీం అఖ్తర్ ఖాన్, మలబార్ గ్రూపు మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *