తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
“మార్చి 14న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం “ఇప్పటం”లో జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్ అన్నారు. శనివారం తెనాలి కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జనసైనికుల సమావేశంలో మాట్లాడుతూ “ఇప్పటం” గ్రామంలో జరగబోయే జ తెనాలి నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ తోటకూర రమణారావు మాట్లాడుతూ ఇటీవలే తెనాలి లోజరిగిన సమావేశంతో జనసేన అంటే ఏమిటో తమపార్టీపట్ల అవాకులు చెవాకులు మాట్లాడే నోళ్ళు మూగవయ్యాయని అని , అలాగే 14న 20ఎకరాల విస్తీర్ణంలో జరిగే సమావేశం జనసైనికులు విజయవంతం చేయాలన్నారు. నిబథ్థత గల్గిన దళితనాయకుడు దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నామకరణం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ పసుపులేటి మురళీకృష్ణ, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్, గుంటూరు జిల్లా కార్యదర్శులు కృష్ణ మోహన్, రాంబాబు, వేణుమాధవ్, తెనాలి- కొల్లిపర మండల అధ్యక్షులు మధుబాబు, వెంకయ్య నాయుడు, సంగంజాగర్లమూడి ఎంపీటీసీ పసుపులేటి వెంకట నరసమ్మ, నందివెలుగు ఎంపీటీసీ విజయలక్ష్మి, మరియు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News