Breaking News

ఎం ఆర్ పి కన్నా అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు..

-జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు…
-27షాపులలో తనిఖీలు, 27కేసులు నమోదు..
-రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిత్యవసర వస్తువులను ఎమ్మార్పీ ధరల కన్నా అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా నిల్వచేసినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ రీజినల్ ఆఫీసర్ టి.కనకరాజు నాయకత్వంలో లీగల్ మెట్రోలజీ, పౌరసరఫరాలశాఖ సంయుక్త ఆధ్వర్యంలో అధికారులు జిల్లాలోని జి.కొండూరు,మైలవరం,ఆగిరిపల్లి, నూజివీడు, హనుమాన్ జంక్షన్, విజయవాడ నగరంలోని 27 నిత్యావసర సరుకుల దుకాణాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఎంఆర్ పి కన్నా అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాల్లో 21కేసులను నమోదు చేశామన్నారు.ముఖ్యంగా వంటనూనెలను ఎంఆర్పి కన్నా ధరలకు విక్రయిస్తున్నట్లూ తనిఖీలలో గుర్తించామన్నారు.కందిపప్పు,మినపప్పు, నూనెలను అనధికారికంగా నిల్వచెసి కృతిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయాలు జరిపే దుకాణాల పై కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ టి.కనకరాజు హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *