మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాల విభజనలో భాగంగా మచిలీపట్నంలో ఏర్పాటు అయ్యే వివిధ ప్రభుత్వ కార్యాలయాల కోసం నగర పరిధిలో గల ప్రభుత్వ ఖాళీ భవనాలను శనివారం రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య నాని, జాయింట్ కలెక్టర్ రెవెన్యూ డాక్టర్ కే.మాధవీలత పరిశీలించారు. తొలుత స్థానిక నోబుల్ కళాశాల ఎదుట గల పాత భవనాన్ని పరిశీలించారు. భవన ప్రస్తుత నాణ్యత పరిస్థితి పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేసిన ఎడల నాలుగు కార్యాలయాల ఏర్పాటుకు వసతి అందుబాటులోకి రాగలదని మంత్రి సూచించగా, ఈ మేరకు అంచనాలు రూపొందించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జేసీ ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా జడ్జి బంగ్లా పక్కన గల పాత రెవెన్యూ క్వార్టర్స్ ను పరిశీలించారు. ఈ క్వార్టర్స్‌లో ఒకదానిలో 46వ డివిజన్ వార్డు సచివాలయం ఏర్పాటుకు చేపట్టిన మరమ్మతులు పరిశీలించారు. ఈ విధంగా మిగతా క్వార్టర్స్ అవసరమైన మరమ్మతులు చేపడితే మరికొన్ని కార్యాలయాలకు వసతి లభిస్తుందన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. బందర్ ఆర్ డి ఓ ఎన్ ఎస్ కే ఖాజావలి, తాసిల్దారు సునీల్ బాబు మంత్రి వెంట ఉన్నారు.
Prajavartha Online Telugu News