Breaking News

రైతులకు కోపరేటివ్ రుణాల రీషెడ్యూల్ సమస్యలపై దృష్టి సారించాలి… : మంత్రి పేర్ని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వెంకట్రామయ్య నాని, జాయింట్ కలెక్టర్ రెవెన్యూ డాక్టర్ మాధవి లత శనివారం కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో బందరు మండల పిఎసిఎస్ అధ్యక్షులు, కార్యదర్శులు, తాసిల్దారు, ఆర్ ఐ లు, వీఆర్వో లతో సమావేశం నిర్వహించి మండలంలో ఆయా గ్రామాల వారి రైతులు కోపరేటివ్ రుణాల రీషెడ్యూల్ సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పాత రోజుల్లో రైతులు పిఎసిఎస్ ద్వారా రుణాలు తీసుకున్నారు, చాలా మంది తిరిగి కట్టేశారు, మరల రుణాలు పొందడం వాటికి వడ్డీలు చెల్లించడం జరుగుతోందన్నారు. అయితే కొంత మంది రైతులు తీసుకున్న రుణాలు రీషెడ్యూల్ కాక సమస్యలు ఎదుర్కొంటు, వడ్డీలు కట్టడానికి అలవాటుపడిపోయారని అన్నారు. అలాంటి రైతులకు షెడ్యూల్ చేస్తే ప్రయోజనం ఉంటుందని, రీషెడ్యూల్ చేయడంలో ఎదుర్కొంటున్న సమస్య మూలాలు గుర్తించి, అటు బ్యాంకులు నష్టపోకుండా, ఇటు రైతులకు అన్యాయం జరగకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రైతుల్లో ఎక్కువమంది బి- ఫారం పట్టాలు కలిగిన వారని, వాటిలో కొన్ని చేతులు మారాయని, శిస్తులు కట్టించుకోవడం లేదని, ఈ విధంగా రీషెడ్యూల్ లో ఎదురయ్యే సమస్యలు అధికారులు మంత్రికి వివరించగా, మండలంలో పీఏసీఎస్ లవారి, గ్రామాల వారి రీషెడ్యూల్ కాని రైతుల జాబితాను తయారు చేయాలని, అందుకు కారణాలు పేర్కొనాలని మంత్రి ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత మాట్లాడుతూ బి- ఫారం పట్టాలు కూడా రీషెడ్యూల్ చేయవచ్చని అన్నారు. రుణాలు రీ షెడ్యూల్ కానీ రైతుల భూములు వాటి క్లాసిఫికేషన్, సర్వే నెంబర్లు, శిస్తులు కట్టించుకోకుండా ఉండడానికి గల కారణాలతో సమగ్ర నివేదిక మూడు రోజుల్లోగా సమర్పించాలని జెసి ఆదేశించారు. కోపరేటివ్ బ్యాంక్ సీఈవో ఆర్డిఓ లు సిబ్బందితో సమావేశం నిర్వహించి రికార్డు క్రోడీకరించి తీసుకోవాల్సిన చర్యలపై నివేదించాలి అన్నారు. ఈ సమావేశంలో ఎం ఎస్ కే ఖాజావలి కే డి సి సి బ్యాంక్ సీఈవో శ్యాం మనోహర్, తాసిల్దార్ డి సునీల్ బాబు తదితరులు పాల్గొన్నారు

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *