


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బృందావన్ కాలనీ ఎ కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన రోటరీ మిడ్ టౌన్ వారి అధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం, ఆదివారం రెండు రోజులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రోటరీ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ వై.పార్ధసారధి, సెక్రటరీ జి.కిషోర్ తెలిపారు. మొదటిరోజు రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారన్నారు. భక్తుల కోసం స్వామివారి దర్శనం ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు.
Prajavartha Online Telugu News