గొల్లపూడి మహాత్మా గాంధి హోల్ సేల్ మార్కెట్ లో ఆర్వో ప్లాంట్ ప్రారంభం…


గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
గొల్లపూడి మహాత్మా గాంధి హోల్ సేల్ మార్కెట్ లో ఆర్వో ప్లాంట్ ను రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ఇప్పటి వరకు మార్కెట్ లో మంచినీటి సమస్యతో కార్మికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు  పడ్డారు. అప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న దేవినేని ఉమా కనీసం మంచి నీటి సౌకర్యాన్ని కూడా కల్పించలేక పోయారు. ప్రజల సమస్యల పరిస్కారం కోసం వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల సమస్యలను తెలికుని ఎమ్మెల్యే వసంత కృష్ణ వరప్రసాద్ మంచి నీటి సౌకర్యాన్ని కల్పించడం సంతోషకరమన్నారు. అనంతరం బిందెలు, దుప్పట్లు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధి హోల్ సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ అధ్యక్షులు పరుచూరి నాగేశ్వరరావు, జనరల్ సెక్రటరీ కాసుల వెంకటనారాయణ, నంబూరి సాంబశివరావు, వెలగపూడి శంకరరావు, అన్నవరపు పార్ధ సారధి, బచ్చు వెంకట రమేష్, పి.ఎస్.వి.ఎన్.వరప్రసాద్ తదితరులు పాలొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *