-పాయకాపురం చెరువు పార్క్ అభివృద్ధి పనులు పరిశీలన
-నగర కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ సింగ్ నగర్ ప్రాంతములో గల పాయకాపురం చెరువు నందలి పార్క్ అభివృద్ధి పనులను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టిన పనులు వివరాలు మరియు వాటి పురోగతిని అధికారులను అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ప్రజలకు ఆహ్లాదం అందించుటతో పాటుగా ఆకర్షనీయమైన మొక్కలను ఏర్పాటు సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు.
ముసాఫర్ ఖానా ప్రారంభాన్నికి సిద్దం చేయాలి
నగర కమిషనర్ శ్రీ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్
ఒన్ టౌన్ పశ్చిమ రైల్వే స్టేషన్ ప్రాంతములోని (ముసాఫర్ ఖానా) షాదీ ఖానాను నగర కమిషనర్ శ్రీ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి పరిశీలించి, ఇంకను పూర్తి చేయవలసిన పనుల వివరాలు సంబందిత అధికారులను అడిగితెలుసుకొని పలు సూచనలు చేస్తూ, పనులు వేగవంతము చేసి నెలాఖరు నాటికీ అప్పగించాలి సంబందిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వి.శ్రీనివాస్, వెంకటేశ్వర రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటీశ్వరరావు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News