-విధి నిర్వహణలో అలసత్వం వహించు వారిపై చర్యలు తీసుకోవాలి
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
20వ శానిటరీ డివిజన్ పరిధిలోని పలు విధులలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి శనివారం తెల్లవారి జమున అధికారులతో కలసి ఆకస్మిక తనిఖి నిర్వహించి అక్కడ విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికల FRS అటెండన్స్ విధానము స్వయంగా పరిశీలించి సిబ్బంది సక్రమముగా విధులకు హాజరు అగుతున్నది లేనిది అధికారులను అడిగితెలుసుకొన్నారు. ఈ సందర్భంలో డివిజన్ నందలి వర్కర్ల యొక్క వివరములను అడిగి తెలుసుకొని డ్రెయిన్ క్లీనింగ్, రోడ్డు స్వీపెంగుకు, బాస్కెట్ కలెక్షన్ కు ఎంత మందిని కేటాయిస్తున్నది తదితర వివరాలు తెలుసుకొని పలు సూచనలు చేస్తూ, FRS అటెండన్స్ లో గాని ట్రేడ్ లైసెన్స్ ఫీజు లలో గాని ఏమైనా జాప్యం కలిగినచొ సంబంధిత శానిటరీ సెక్రటరీల పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. డివిజన్ పరిధిలోని యూజర్ చార్జీలు వసూలు విధానము అడిగితెలుసుకోనిన సందర్భంలో వారికి రశీదులు ఇస్తున్నారు అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా బార్ & రెస్టారెంట్ హోటల్స్, మరియు లాడ్జీలు వద్ద నుండి ట్రేడ్ లైసెన్స్ ఏ ఏ కేటగిరి లో ఎంత ఎంత వసూలు చేస్తున్నారు అందరూ సక్రమముగా చెల్లిస్తున్నది లేనిది వివరములు అడిగి తెలుసుకున్నారు.
తదుపరి కృష్ణలంక డ్రెయినేజి పంపింగ్ స్టేషన్ యొక్క పరితీరు పరిశీలించి, అండర్ గ్రౌండ్ డ్రెయినేజి విభాగము పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయుచూ వెంటనే మ్యాన్ హోల్స్, డ్రైనేజీ సమస్యల పరిష్కరానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించడమైనది. డివిజన్ పరిధిలోని రణధీర్ నగర్, సత్యం గారి దొడ్డి తదితర ప్రాంతాలను పర్యటిస్తూ, ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అవుట్ ఫాల్ డ్రెయిన్ నందలి మురుగునీటి పారుదలను పరిశీలిస్తూ, డ్రెయిన్ నందలి వ్యర్ధములను ఎప్పటికప్పడు తొలగించి మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా చూడాలని అధికారులకు సూచించారు. డివిజన్ లో పారిశుధ్య నిర్వహణకు ఎటువంటి అవరోధం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం 21వ డివిజన్ పరిధిలో గల అంగన్ వాడి స్కూల్ ప్రక్కన శిదిలా వ్యవస్థ ఉన్న భవనములో రాత్రిపూట ఆకతాయిలు చేరి అసాంఘిక పనులు చేపడుతున్నట్లు స్థానిక కార్పొరేటర్ పుప్పాల నరసకుమారి మరియు స్థానికులు మేయర్ గారి దృష్టి తీసుకురాగా సదరు ప్రదేశాన్ని పరిశీలించి ఒక స్కూల్ బిల్డింగ్ నిర్మించుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. రణధీర్ నగర్ మెట్లబజార్ వై.యస్.ఆర్ విగ్రహం దగ్గర ఇళ్ల మధ్యలో ట్రాన్సఫార్మ్ ఉండుట వాళ్ళ స్థానికులకు చాలా ఇబ్బంది కారముగా ఉన్నందున తక్షణమే తరలించి మరొక ప్రదేశంలోకి మార్చుటకు చర్యలు తీసుకోవలసినదిగా విద్యుత్ శాఖాదికారులకు ఆదేశించడమైనది. కృష్ణలంక పద్మావతి ఘాట్ సమీపంలో పందులను గమనించి తక్షణమే వాటిని అక్కడ నుండి తరలించుటకు చర్యలు తీసుకోవాలని మరియు అదే ప్రదేశంలో అక్రమముగా పాకలు వేసుకొని ఉన్న ఇళ్లను యుద్దప్రాతిపదికన అక్కడ నుండి తొలగించాలి టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించడమైనది.
ఈ పర్యటనలో 20వ డివిజన్ కార్పొరేటరు అడపాశేషు, 21వ డివిజన్ కార్పొరేటరు పుప్పాల నరసకుమారి గారు హెల్త్ ఆఫీసర్ డా. ఇక్బాల్ హుస్సేన్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా. రవిచంద్, శానిటరీ ఇన్స్ పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.