విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్చ్ సర్వేక్షణ్ -2022 లో ఉత్తమ ర్యాంక్ సాదించే దిశగా చర్యలలో భాగంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జీ.గీతాభాయి అద్వర్యంలో హెల్త్ ఆఫీసర్ డా. బి.శ్రీదేవి పర్యవేక్షణలో క్రిస్ట్ ది కింగ్ స్కూల్ విద్యార్ధులచే క్రిస్తురాజపురం మెయిన్ రోడ్ 7th టౌన్ పోలీస్ స్టేషన్ నుండి స్కూల్ వరకు ర్యాలి నిర్వహించారు. స్కూల్ ఆవరణలో విద్యార్ధులు మనవహరంగా ఏర్పడి స్వచ్చ్ విజయవాడ – స్వచ్చ్ భారత్ ప్రతిజ్ఞా చేసారు. సదరు ప్రతిజ్ఞ యందు విద్యార్ధులందరూ విజయవాడ నగరాన్ని స్వచ్చ్ సర్వేక్షణ్ – 2022 నందు మొదటి ర్యాంక్ సాదించుటకు తమ వంతు కృషి చేస్తామని, సిటీ ఫీడ్ బ్యాక్ లో నగరాన్ని అగ్రస్థానములో ఉంచుతామని చెత్తను, తడి చెత్తగా విభజించి నగరపాలక సంస్థ సిబ్బందికి అందజేస్తామని, సింగల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను నిషేదించి పర్యావరణాన్ని కాపాడతామని, చెత్త రహిత నగరాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంగా ఉంచుతామని, చెత్త రహిత నగరంగా GFC – 5స్టార్ రెట్టింగ్ సిటీగా ఉంచుతామని, ODF++, వాటర్ ప్లస్ సిటీగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేసారు.
మెగా ర్యాలి నందు హెల్త్ ఆఫీసర్ డా. కె. సురేష్ బాబు, శానిటరీ సూపర్ వైజర్ ఆర్.ఒబేశ్వరరావు, సలీమ్ అహ్మద్, శానిటరీ ఇన్స్ పెక్టర్లు రాయలు, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ మరియు శానిటరీ సెక్రటరీలు, హెల్త్ వర్కేర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News