Breaking News

రూ. 285 కోట్లతో ఇంటింటి కి త్రాగు నీరు… :  మంత్రి శ్రీరంగనాధ్ రాజు

ఆచంట(తూర్పు పాలెం), నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ ఒక్కరికీ స్వచమైన నీరు అందించాలనే లక్ష్యం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అశాయనికి కి అనుగుణంగా జిల్లాలో రూ. 285 కోట్లతో పైపు లైన్ ప్రారంభించినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. శనివారం తూర్పుపాలెం లోని మంత్రి కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ నీటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం నేరుగా ఇంటింటికి పైపు లైన్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన పనులు జల జీవన్ మిషన్లో భాగంగా జరుగుతాయని తెలిపారు. ఆచంట నియోజకవర్గంలో రూ. 6 కోట్ల 20 లక్షలతో పనులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని 51 ప్రాంతాలలో పనులు పూర్తి చేసి ఇంటింటికి నీరు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సమీక్షలో ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాసరాజు ఏ ఈ లు ఎండి బుష్ర, ఎన్ మూర్తి రాజు పాల్గొన్నారు. అనంతరం ఆచంట లో పర్యటించి రోడ్ విస్తరణ పనులు మంత్రి సమీక్షిచడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గణనాధుడిని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *