Breaking News

కన్నుల పండుగగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్విసెస్ ఆసోసియోషన్ స్వర్ణోత్సవాలు…


-రాష్ట్ర నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్విసెస్ ఆసోసియోషన్ భాగస్వామ్యం కావాలి
-ప్రభుత్వ సలహదారు సంజ్జల రామకృష్ణ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు మరియు రాష్ట్ర మహాసభ స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్థిక మరియు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మాత్యులు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పేర్ని వెంకట్రామయ్య, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లం మరియు ఆశాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో పాటుగా పదిహేను రాష్ట్రాల వాణిజ్య పన్నుల ప్రతినిధులు, రాష్ట్రంలోని పలు జిల్లాల ఐఎస్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏ ప్రాంత పరిపాలనకైనా పన్నులు వసూలు కీలక పాత్ర పోషిస్తాయని మన రాష్ట్ర ఆదాయంలో పరోక్ష పన్నులు సింహభాగం గా ఉన్నాయని వీటిని మరింత సమర్థవంతంగా అమలు పరచి నట్లయితే మరింత ఆదాయాన్ని పొందడం ద్వారా పేదల సంక్షేమానికి మరింత పాటు అందులో భాగంగా ఇతర రాష్ట్రాలలో వ్యవస్థను ఇటీవల అధ్యయనం చేయడం జరిగిందని త్వరలోనే రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖను పునర్నిర్మాణం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు . అనతి కాలంలోనే రాష్ట్రం ఎగుమతులలో నాలుగో స్థానానికి చేరుకున్న ఘనత ప్రస్తుత ప్రభుత్వానికి చెందుతుందని పేర్కొన్నారు. మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ కేవలం ఆర్థిక పరిస్థితి సహకరించక పోవడం వల్లే మెరుగైన పిఆర్ సి ప్రకటించే లేక పోయామని ఉద్యోగులు హృదయంతో సహకరించాలని కోరారు . ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం మాట్లాడుతూ వ్యాపారస్తులను వేదించకుండా, పన్ను ఎగవేతలను అరికట్టాలని , వస్తు ఉత్పత్తి వినియోగాన్ని అంచనా వేయడం ద్వారా పన్ను మదింపు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరములు అధ్యక్ష హోదాలో కొనసాగిన కె.ఆర్.సూర్యనారాయణ కి ఈ అసోసియేషన్కు మారుపేరని ఆయన దీక్ష వలనే ఈ అసోసియేషన్ ఇంతకాలం కొనసాగిన ఆయన నిస్వార్థ సేవలు వలనే నేడు జియస్టీ లకు గజిటెడ్ హోదా సాకారం అయిందని పేర్కొన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు  కె.ఆర్.సూర్యనారాయణ మాట్లాడుతూ ఈ అసోసియేషన్ స్వర్ణోత్సవాలు జరుపుకొంటుందంటే అది కేవలం శాఖ ఉద్యోగులకు తన పై గల నమ్మకం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో సంఘంలో వివిధ స్థాయిలో పని చేసిన వారిని సన్మానించడం జరిగినది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల శాఖా ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *