Breaking News

ఈనెల 10 తేదీన నిర్వహించే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలి …

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 10 తేదీన నిర్వహించే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీ రావు అధికారులను ఆదేశించారు.
కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షలో భాగంగా ఈనెల 10వ తేదీన నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నావల్‌ అకాడమీ పరీక్షలకు చేపట్టవలసిన ఏర్పాట్ల పై శుక్రవారం నగరంలోని కలెక్టర్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌లో రెవెన్యూ, పోలీస్‌, వైద్య ఆరోగ్య, నగరపాలక సంస్థ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడతూ కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఏర్పాట్లు ఉండాలన్నారు. ఈ పరీక్షకు విజయవాడ కేంద్రంగా 3,060 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. పరీక్ష నిర్వహణకు 7 సబ్‌సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో పిబి సిద్ధార్ధ ఆర్ట్స్‌ అండ్‌ సైస్‌ కళాశాల, ఆంధ్ర లయోలా కళాశాల , శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్ధ మహిళ కళాశాల, మేరీ స్టేల్లా కళాశాల, కెబిఎన్‌ కళాశాల , ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ కళాశాల, ఆంధ్ర లయోలా ఇన్‌స్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలు ఉన్నాయన్నారు. పరీక్షలను నిర్వహించేందుకు 9 మంది తహాశీల్థార్లను లైజన్‌ ఆఫీసర్లగా నియమించామన్నారు. 25 మంది అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లగా నియమించామన్నారు. పరీక్ష కేంద్రాలలో 288 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తిస్తారన్నారు. పరీక్ష కేంద్రాలను ముందుగానే పరిశీలించి అన్ని ఏర్పాట్లు ఉండేలా చూడాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ నుండి పరీక్ష కేంద్రాలకు ఓఆర్‌యం షీట్లు, బుక్‌లెట్లను తరలించేందుకు, పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. వేసవి దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ పరీక్ష కేంద్రాల వద్ద ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్స్‌, మందులతో కూడిన మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రస్త్ర 5 గంటల వరకు విద్యుత్‌కు అంతరాయం లేకుండా విద్యుత్‌ శాఖాధికారులు చూడాలన్నారు. ఏపిఎస్‌ఆర్టీసీ బస్‌స్టాండ్‌, రైల్వేస్టేషన్‌ నుండి పరీక్ష కేంద్రాలకు బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థుల సెల్‌ ఫోన్‌లను బద్రపరిచేందుకు ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద డిపాజిట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి క్యాలిక్యూలెటర్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకురాకుండా పరీక్ష కేంద్రం గేటు వద్దే స్వదినం చేసుకోవాలన్నారు. పరీక్ష నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కలెక్టర్‌ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. నగర పాలక సంస్థ అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాల పరిశరాలను ముందుగానే శుభ్రపరచి సిద్దంగా ఉంచాలని ప్రత్యేకంగా టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి పరీక్ష కేంద్రాలను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, ట్రైని కలెక్టర్‌ శోబికా, తహాశీల్థార్లు యంపిడివోలు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *