Breaking News

సంక్షేమ పథకాలు పేద ప్రజల గుండెల్లో శాశ్వతం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం ధ్యేయం గా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ లో గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం లో ట్రెజరరీ ఎంప్లాయిస్ కాలనీ లో అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్ల కాలంలోనే సంక్షేమ పథకాలు అమలు కు దాదాపు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు మహిళల ఖాతాలలో జమ చేసిన ఘనత జగనన్న దే అని అన్నారు. తెలుగుదేశం పార్టీ కి బలముంది అని వారు ప్రచారం చేసుకొనే ఈ 12వ డివిజన్ లోనే దాదాపు 6 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ, ఉర్దూ స్కూల్ అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు. రోజురోజుకు ప్రజలలో ముఖ్యమంత్రి కి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వాటిని తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించి పార్టీని ప్రజలకి మరింత చేరువ చేయడానికె ఈ గడప గడప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపతిన్నట్టు తెలిపారు. అర్హత ఉండి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా ఏదైనా పధకం రాకపోతే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ప్రతి ఇంటిలో ఏ ఏ సంక్షేమ పథకాలు అందజేశారో వారికి సవివరంగా వివరించి పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైస్సార్సీపి ఇంచార్జ్ మాగంటి నవీన్,డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్, కార్పొరేటర్ ప్రవల్లిక, అంబెడ్కర్, సాంబయ్య వైస్సార్సీపీ నాయకులు అల్లా చెల్లారావు, బషీర్, పర్వేజ్, చిన్న తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *