Breaking News

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం గా జరుగుతున్నాయి అని, గత టీడీపీ ప్రభుత్వం లోలాగ శంకుస్థాపన లు చేసి ప్రచారాలు చేసుకొని వదిలేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పనులు పూర్తి అయ్యేవరకు వైస్సార్సీపీ నాయకులు దగ్గరుండి అన్ని చర్యలు తీసుకొంటున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ రాణిగారితోట మెయిన్ రోడ్డు నందు దాదాపు 10లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో స్థానిక కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబెర్ తంగిరాల రామిరెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైయిన్ మ్యాన్ హోల్స్ క్యాపింగ్ పనులకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బేల్లం దుర్గ లతో కలిసి అవినాష్ పాల్గొని నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 17,18 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు అని ఒక్క రూపాయి కూడా ఈ డివిజన్లు అబివృద్ది నోచుకోలేదు అని అన్నారు. జగన్మోన్ రెడ్డి ప్రభుత్వం లో పార్టీలు,కులాలు అని చూడకుండా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అసంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్న ఘనత వైసీపీ ప్రభుత్వం దే అని అన్నారు. వీలైనంత త్వరగా ఎలాంటి నాణ్యత లోపం లేకుండా డివిజన్ నాయకులు దగ్గరుండి నిర్మాణ పనులు పూర్తి చేపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగవంశ డైరక్టర్ సుజాత,మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బాలరాజు,వైస్సార్సీపీ నాయకులు సానికొమ్ము వెంకటేశ్వర రెడ్డి,డబ్బుకొట్టు వెంకటేశ్వర రావు,తాజుద్దున్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *