– కోల్ క్రైసిస్ కు ఇప్పటి వరకు బకాయిలు లేవు..సింగరేణి, రైల్వేస్,కోల్ ఇండియాకు సకాలంలో చెల్లింపులు
– గృహ వినియోగదారులకు పెద్దగా విద్యుత్ కోతలు విధించకుండా అధిగమించాం
– గత ప్రభుత్వ కాలంలో 6 శాతంగా ఉన్న విద్యుత్ గ్రోత్ ఇప్పుడు 14 శాతానికి పెరిగింది
– వివరాలను వెల్లండించిన ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఏర్పడిన విపత్కర పరిస్థితులు, వ్యవసాయ రంగంలో వచ్చిన డిమాండ్, కోల్ క్రైసిస్ వల్ల విద్యుత్ వినియోగం, డిమాండ్ ల మధ్య వ్యత్యాసం విద్యుత్ కోతకు ప్రదాన కారణాలుగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ తెలిపారు. ఆదివారం విజయవాడలోని ఆర్ అండ్ బీ బిల్డింగ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న విధానాలు దేశానికే రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలుస్తుందని ఇటీవల ఎన్టీపీసీ చైర్మన్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంలో తెలిపారన్నారు. రాబోయే 30 సంవత్సరాలను ధృష్టిలో ఉంచుకొని రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇప్పుడు వచ్చే విద్యుత్ సమస్యలు తాత్కాలికమేనని, అవి త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. గత నెల నుంచి విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరిందని, సాగుకు వాడే విద్యుత్ వినియోగం ఈ నెలాఖరుకు తగ్గే అవకాశం ఉందని, సాగు విద్యుత్ వినియోగం తగ్గాక పరిశ్రమలకు యథావిథిగా విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. పరిశ్రమల రంగం నుంచి ఇప్పటికే వినతులు అందుతున్నాయని, త్వరలో వారితో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం నిన్న తీసుకున్న చర్యల వల్ల గృహావసరాలకు, వ్యవసాయానికి విద్యుత్ కోతలను నేడు తగ్గించగలిగామన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ఆయన తెలిపారు.
కోల్ క్రైసిస్ గత అక్టోబర్ నుంచి ఉన్నా.. ఇప్పటి వరకు కోల్ కంపెనీలకు ఎటువంటి బకాయిలు లేవని, సింగరేణి నుంచి మనకు నిరంతరాయంగా కోల్ సరఫరా చేస్తున్నారన్నారు. నిన్ననే కోల్ కంపెనీలకు రూ. 150 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. కోల్ ఇండియా మనకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేస్తున్నారు, రైల్వేస్ కూడా మనకు కోల్ సప్లైకి రాక్ లు క్రమం తప్పకుండా పెడుతున్నారన్నారు. కోల్ ఇండియాకు సకాలంలో చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. ఈ రోజు గృహ వినియోగదారులకు పెద్దగా విద్యుత్ కోతలు లేకుండా అధిగమించామన్నారు. గత ప్రభుత్వ 2014-15 కాలంలో 6 శాతంగా ఉన్న విద్యుత్ గ్రోత్ (సంవత్సరానికి సంవత్సరానికి మధ్య గ్రోత్) 2020-21 లో 14 శాతానికి పెరిగిందని తెలిపారు. 2014-19 లో కెపాసిటీ ఎడిషన్ జరగడం వల్ల డిస్కంల్ పై, వినియోగదారులపై కూడా భారం పడిందని చెప్పారు. 2014-15 లో తీసుకున్న లోన్లు రూ.30,000 నుండి 2018-19 కి రూ.60,000 కోట్లకు పెరిగాయన్నారు. గత ప్రభుత్వం సబ్సిడీ రిలీజ్ లు ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఇవ్వకపోవడం వల్ల డిస్కమ్స్ పై భారం అంత భారీగా పెరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రూ. 36,000 కోట్ల సబ్సిడీలను ఇప్పటికే చెల్లించిందన్నారు.
ఇప్పుడు యావరేజ్ పవర్ పర్చేజ్ కాస్ట్ 5.10 గా ఉందన్నారు. గత ప్రభుత్వం ట్రూ అప్ చార్జీలను అశ్రద్ధ చేయడంతో 2019 లో వచ్చిన ప్రభుత్వం పై ఇవన్ని కలసి పెరిగాయన్నారు.
విశాఖపట్టణంలో ఉన్న హిందూజా పవర్ కూడా కోల్ సరఫరా చేయమని రాష్ట్ర ప్రభుత్వం అడగటం జరిగిందన్నారు. సెఖీతో ఒప్పందం వల్ల వ్యవసాయానికి మేలు జరిగేవిధంగా 7,000 మెగా వాట్ల విద్యుత్ సరఫరా అయ్యేవిధంగా ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. దీనివల్ల 2024 లో వ్యవసాయ రంగంలో వచ్చే మిగులు విద్యుత్ ను పరిశ్రమలకు తరలించడానికి అవకాశం ఉంటుందన్నారు.
అన్ని రంగాల్లోను పరిశ్రమల్లో ఎకానమిక్ యాక్టివిటీ పెరగడం, వేసవిలో గృహావసరాల వినియోగం కూడా ఎక్కువగా ఉండడంతో విద్యుత్ అవసరం పెరిగిందన్నారు. గతేడాది అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత ఏర్పడిందని, దేశీయంగా ఉత్పత్తి అయ్యే బొగ్గు వినియోగం పెరిగి లభ్యత తగ్గిందన్నారు. బొగ్గు సరఫరా గురించి ముఖ్యమంత్రి, ప్రధానితో మాట్లాడటం, రైల్వే, కోల్, ఎనర్జీ మంత్రిత్వశాఖలకు లేఖలు రాయడం జరగిందన్నారు. మన రాష్ట్రానికి రోజుకి కావాల్సినంత బొగ్గు సరఫరా అవుతుందన్నారు. నెలాఖరుకు అన్ని పరిస్థితులు సర్థుకుంటాయన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత, పోస్ట్ కోవిడ్ తర్వాత రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం, దేశీయంగా బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్ వంటి ఈ మూడు ప్రధాన కారణాలతో విద్యుత్ కొరతతో ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయని…
కృష్ణపట్టణం విద్యుత్ కేంద్రం 90 శాతం పూర్తి కావడంతో దాన్ని కమిషన్డ్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా అప్పర్ సీలేరును 800 మెగా వాట్స్ కు కమిషన్డ్ చేయడం జరుగుతుందన్నారు. పోలవరంలో 960 మెగా వాట్స్ కు పనులు జరుగుతున్నాయి, అప్పర్ సీలేరు లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ 1300 మెగా వాట్లు డీపీఆర్ జరుగుతుందని, ఇది టెండర్స్ పరిస్థితుల్లో ఉందన్నారు. నెట్ కాప్ నుంచి 7 ప్రాజెక్టులకు పంప్డ్ స్టోరేజ్ కి 6,600 మెగా వాట్స్ కు టెండర్స్ జరుగుతున్నాయన్నారు. మే నెలలో మొదలై జూన్, జులై వరకు మాత్రమే విండ్ పవర్ తక్కువ సమయంలోనే అందుబాటులో ఉంటుందన్నారు. 12 వ తారీఖున విద్యుత్ సమస్యలపై కేంద్రం సమావేశంను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. కోల్ సమస్య మనము సృష్టించుకున్నది కాదని ఇది అంతర్జాతీయంగా ఉన్నసమస్య అని తెలిపారు.
ప్రభుత్వం ఇప్పుడు కేవలం పునరుత్పాదక ఇంధన ఉత్పాదక సామర్థ్యాన్ని కట్టడి చేయడమే కాకుండా, భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేలా రివర్స్ పంపింగ్ వంటి నిల్వ పరిష్కారాలను అందించడానికి సన్నిహితంగా పని చేస్తోందన్నారు. అధిక వర్కింగ్ క్యాపిటల్ లోన్‌లు, తగినంత సబ్సిడీ చెల్లింపులు, షెడ్యూల్ ప్రకారం ట్రూ-అప్‌లను దాఖలు చేయకపోవడం మొదలైన అనేక కారణాల వల్ల డిస్కమ్‌లపై ఆర్థిక ఒత్తిడి ఏర్పడిందని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ తెలిపారు. ఈ సమావేశంలో ఏపి ట్రాన్స్ కో జేఎమ్ డి ఐ. పృద్వీరాజ్ కూడా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News