

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం కొత్తపేటలోని శ్రీ నగరాల సీతారామ స్వామి వారి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ,విజయవాడ నగర మేయర్ రాయనభాగ్యలక్ష్మి, దుర్గగుడి మాజీ చైర్మన్ పైలా సోమి నాయుడు, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ళ విద్యాధరరావు తదితర ప్రముఖులు పాల్గొని శ్రీ స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న అందుకు దేవస్థానం కమిటీని అభినందించారు. కళ్యాణోత్సవానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలను ఆలయ కమిటీ కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు వేద పండితుల మంగళ ధ్వానాల మధ్య కళ్యాణోత్సవం వేదిక వద్దకు తీసుకువచ్చారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరు పిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు( పిసి ) తదితర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. రామాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన వేదికపై శ్రీసీతారాముల కళ్యాణాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలను ఎలా నిర్వహిస్తారో అదే తరహాలో ఈ ఆలయంలో కూడా సీతారామ కళ్యాణాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు . శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి కల్యాణోత్సవంలో బంక హనుమంతరావు -వెంకట లక్ష్మి దంపతులు కల్యాణోత్సవ తలంబ్రాలు పోయడం జరిగింది. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి వరుసక్రమంలో శ్రీ సీతారాముల వారిని కనులారా వీక్షించారు. శ్రీ సీతారామ కళ్యాణంలో పలువురు నగర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. జనసేన విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ తదితరులు సీతారాముల కల్యాణాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ గౌరవ అధ్యక్షులు బెవర సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మరుపిళ్ళ సత్యనారాయణ, బెవర శ్రీనివాస రావు, సహాయ కార్యదర్శులు శీరం వెంకట రావు, కార్యవర్గ సభ్యులు గూడేల రామకృష్ణ (RK) ఈది ఎల్లారాజారావు, కామందుల నరసింహారావు, మజ్జి ఈశ్వరరావు,పణుకు రమ,మజ్జి శ్రీనివాసరావు, పోతిన బేసుకంటేశ్వరుడు, భోగవల్లి శీధర్, పోతిన సాంబశివరావు, తమ్మిన సూర్యకుమారి, ఈది ఎల్లారావు, బెవర సాయి సుధాకర్, పోతిన వెంకట ధర్మారావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News