విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతైనా అభినందనీయమని దేవినేని అవినాష్ అన్నారు. శనివారం నాడు విశాలాంధ్ర రోడ్, మీ.సేవ దగ్గర నగర మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరియు ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ లో దేవ దండల సేవా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్నిఅవినాష్ ప్రారంభించారు. పాదచారులకు, వాహనదారులకు చలివేంద్రం వేసవిలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,స్టాండింగ్ కమిటీ మెంబెర్ కలపాల అంబేద్కర్,కార్పొరేటర్లు భీమిశెట్టి ప్రవల్లిక,వియ్యపు అమర్నాధ్,మాజీ డిప్యూటీ ఆళ్ల చెల్లారావు వైస్సార్సీపీ నాయకులు సంపత్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News