Breaking News

శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలన్న దయామయుడు యేసుక్రీస్తు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మానవాళిలో ప్రేమతత్వాన్ని నింపేందుకు, సమాజంలో శాంతిని నెలకొల్పడం కోసం.. క్రీస్తు తన జీవితాన్ని అంకితం చేశారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ లో అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ (AICC) ఆధ్వర్యంలో జరిగిన పునరుత్ధాన ప్రార్థన ఉజ్జీవ సభలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి సామరస్యాలకు మార్గాలు చూపుతాయని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. పరుల కోసం జీవించే వారు చరితార్థులు అవుతారనడానికి క్రీస్తు జననమే ఒక నిదర్శనమని పేర్కొన్నారు. కరుణామయుడైన యేసును శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే అయితే.. ఆ తరువాత ఏసు పునరుజ్జీవించిన ఆదివారం రోజు ఈస్టర్ అని గుర్తుచేశారు. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలని కొనియాడారు. శత్రువుల పట్ల క్షమ‌, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవి జీసస్ తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన గొప్ప సందేశాలని చెప్పారు. మానవ ప్రయత్నాలకు దేవుని ఆశీస్సులు తోడైతే మంచి ఫలితాలు ఉంటాయనడానికి జగనన్న సుపరిపాలనే ఒక ఉదాహరణ అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. 2010లో ప్రారంభించబడిన ఏఐసిసి అనతికాలంలోనే 16 రాష్ట్రాలకు తమ సేవలను విస్తరించి అంతర్జాతీయ గుర్తింపు పొందడం హర్షణీయమన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్లు గేర హోనోక్, జాన్, జాన్సన్, సంఘ సభ్యులు, క్రైస్తవ సోదర సోదరీమణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *