Breaking News

అగ్ని ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం 28 వ డివిజన్ లక్ష్మినగర్ లోని ఓ ఇంట్లో శనివారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు, ప్రమాదానికి గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. టీవీ, ఏసీ, లాప్టాప్, సోఫా సెట్ సహా పలు విలువైన సామాగ్రి ప్రమాదంలో కాలిపోయినట్లు.. సుమారు రూ. 2.5 లక్షల నష్టం వాటిల్లినట్లు భాదితులు ఎమ్మెల్యేకి వివరించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా మల్లాది విష్ణు హామీనిచ్చారు. ఎమ్మెల్యే వెంట దాసాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ కనపర్తి కొండలరావు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *