Breaking News

ముక్కంటి కరుణా కటాక్షాలు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-కమనీయం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం సత్యనారాయణపురంలోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి వార్షిక త్రయాహ్నిక కళ్యాణ మహోత్సవం శనివారం కన్నులపండువగా జరిగింది. భక్తులు వేకువజామునుంచే ఆ పరమేశ్వరుని సన్నిధికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అశేష భక్తజన సందోహం సమక్షంలో వేద మంత్రోచ్చరణల మధ్య శివపార్వతుల కళ్యాణం ఎంతో వైభవోపేతంగా కొనసాగింది. ఉదయం నిత్య పూజ, నిత్యౌపాసన, స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకము, అమ్మవారికి పంచామృత స్నపనాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీమతి దూపాటి శ్రీదేవి బృందంచే నిర్వహించిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించారు. తొలుత గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. సృష్టి లయకారుడు, ఓంకార స్వరూపుడైన శంకరుని భక్తి ప్రపత్తులతో ధ్యానిస్తే కష్టాలన్నీ తొలగిపోయి.. సకల శుభాలు కలుగుతాయన్నారు. ఆ ముక్కంటి కరుణా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కాంక్షించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. దేవాలయాల అభివృద్ధికి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. రాష్ట్రవ్యాప్తంగా 1,072 ఆలయాల నిర్మాణానికి టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి ఆమోదం తెలపడం శుభపరిణామన్నారు. తదనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు పలికి పరమశివుని తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, నాయకులు రామకృష్ణ రావు, భగవాన్ రాజ్, దోనేపూడి శ్రీను, యల్లాప్రగఢ సుధీర్, కోలవెన్ను కొండ, సనత్, కూనపులి ఫణి, లంకా బాబు, శివ, రాజశేఖర్, కంభంపాటి ప్రసాద్, రవిశంకర్, ఈవో యడ్లపల్లి సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *