Breaking News

పూర్తి శాఖాహార “విలేజ్ దాబా” ప్రారంభం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాఖాహార భోజనప్రియులకు అందరికి అందుబాటులో ఉండే విధముగా సీతయ్యా’స్ “విలేజ్ దాబా” ను ప్రారంభించారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. శనివారం సత్యనారాయణపురం, శారద కాలేజ్ జంక్షన్ బీ.ఆర్.టీసీరోడ్డు దగ్గర “విలేజ్ దాబా” ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల రుచులతో పూర్తి శాకాహార ఆహారం ఉండేటట్లు ఈ దాబా ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ దాబా దినదినాభివృద్ధి చెందుతూ నగరంలో మరిన్ని దాబా సెంటర్ లు రావాలని ఆయన ఆకాంక్షించారు. విలేజ్ దాబా నిర్వాహకులు వెంకట సీతారామ్ మాట్లాడుతూ తమ దాబా ను మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తమ దాబా లో నార్త్ ఇండియన్ ఫుడ్ ఐటమ్స్, చైనీస్ ఫుడ్ ఐటమ్స్, తందూరి, బిర్యానీలు అన్ని రకాల చాట్ తిను బండారాలు, ఇంకా అనేక రకాల శీతలపానీయాలు, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్ ఉన్నాయని తెలిపారు. శాకాహారుల కోసం ఈ దాబాను ప్రారంభించడం జరిగిందని, నగరంలో మరిన్ని దాబా సెంటర్ల ను ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ బాల మురళీ కృష్ణ, కార్పొరేటర్ సర్వానంద్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ దుర్గాప్రసాద్ లు, మిత్రులు తులసీనాధ్, సుబ్రహ్మణ్యం, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *