Breaking News

బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల తనిఖీ నిర్వహించిన ఆర్టీసీ ఎండి సి.హెచ్‌.ద్వారకా తిరుమలరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయి పర్యటనల కోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డ 2-బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులను, 1-ప్యాంట్రీ వాహనాన్ని ఆర్టీసీ ఎండి సి.హెచ్‌.ద్వారకా తిరుమలరావు, ఐ.పి.ఎస్‌. విజయవాడ డిపోలో స్వయంగా తనిఖీచేసి, వాహనాల కండీషన్‌ను పరిశీలించి సంతృప్తివ్యక్తంచేసారు. వాటి నిర్వహణపట్ల అధికారులు తీసుకుంటున్న రోజువారీ జాగ్రత్తలు, ట్రయల్‌ రన్‌, పరిశుబ్రత పనితీరు, తదితర విషయాలను అడిగి తెలుసుకుని వారిని అభినందించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర పర్యటనల కోసం, ఏపీఎస్‌ఆర్టీసీ 2009, 2015 సంవత్సరములలో రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను మరియు ఒక ప్యాంట్రీ కారును కొనుగోలు చేయడం జరిగింది. ఈ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు వివిఐపి పర్యటనలకు అనుకూలంగా ఎన్నో ప్రత్యేకతలను కలిగివున్నాయి. అయితే, ముఖ్యమంత్రి వై .ఎస్‌. జగన్మోహనరెడ్డి ఇంతవరకూ ఈ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను వినియోగించుకోలేదు. అయినప్పటికినీ, ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి వివిధ జిల్లాలను తరచూ సందర్శిస్తున్న సందర్బాలలో ఈ వాహన అవసరం ఉండవచ్చునన్న ఉద్దేశ్యంతో ఆర్టీసీ ఎండి సి.హెచ్‌.ద్వారకా తిరుమలరావు, ఐ.పి.ఎస్‌. విజయవాడ డిపోలో ఉన్న 2-బుల్లెట్‌ ప్రూఫ్‌ మరియూ ప్యాంట్రీ వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ వాహనాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని, సంబంధిత ఆర్టీసీ అధికారులు, సూపర్‌వైజర్లకూ కొన్ని నిర్దిష్ట సూచనలు చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *