Breaking News

ప్ర‌పంచ శాంతిని కాంక్షిస్తూ పానిక్ చిత్ర నిర్మాణం…


-విశాఖ అందాల న‌డుమ చిత్ర నిర్మాణానికి అంకురార్ప‌ణ‌
-అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో రూప‌క‌ల్ప‌న
-మీడియా స‌మావేశంలో చిత్ర నిర్మాత‌లు చైత‌న్య‌ జంగా, విజ‌య్‌వ‌ర్మ పాక‌ల‌పాటి వెల్ల‌డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రీసెర్చ్ మీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై చైత‌న్య జంగా మ‌రియు విజ‌య్‌వ‌ర్మ పాక‌ల‌పాటి నిర్మిస్తున్న చిత్రం పానిక్‌ ఉక్రెయిన్‌, ర‌ష్యాల మ‌ధ్య న‌డుస్తున్న యుద్ధ ప్ర‌భావంతో ఆ దేశాలే కాకుండా యావ‌త్ ప్ర‌పంచం ఒక తెలియ‌ని భ‌యాందోళ‌న‌కు గురువుతున్న నేప‌ధ్యంలో నేటి ప‌రిస్తితుల‌కు అర్థం ప‌ట్టేలా ప్ర‌పంచ శాంతి చేకూరేలా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే మ‌రియు ద‌ర్శ‌క‌త్వం సురంజ‌న్ దే వ‌హిస్తున్నారు.

నిర్మాత చైత‌న్య జంగా మాట్లాడుతూ.. పానిక్ అనేది ఒక భ‌యంక‌ర‌మైన వ్యాధి అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌ర లేద‌న్నారు. ప్ర‌తీ మ‌నిషి జీవితంలో ఒక‌టి లేదా అంత‌కంటే ఎక్కువ‌సార్లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతాడ‌ని చెప్పారు. ఎవ‌రైనా తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురైతే, అది ప్ర‌మాదం అని పేర్కొన్నారు. అయితే యుద్ధ కాల భ‌యాందోళ‌న‌తో పోల్చ‌లేమ‌నేది పానిక్ కథ యొక్క ప్ర‌ధాన ఇతివృత్తం అని తెలిపారు. అంత‌ర్జాతీయంగా 7 అవార్డులు సాధించిన సురంజ‌న్ దే ప్ర‌తీ సినిమా సామాజిక సందేశాన్నిచ్చేలా రూపొందించ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌ని తెలిపారు. ఇటీవ‌ల ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ప్ర‌మోష‌న్ కౌన్సిల్ త‌ర‌ఫున ఘ‌నంగా స‌త్క‌రించిన‌ట్లు చెప్పారు. పానిక్ చిత్రానికి ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌ర‌ఫున పూర్తి స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తామ‌ని వెల్ల‌డించారు.

మ‌రో నిర్మాత విజ‌య్‌వ‌ర్మ పాక‌ల‌పాటి మాట్లాడుతూ.. అందుకే కోపాన్ని, హింస‌ను మ‌రచి శాంతిని కోరుకోండి అనే సందేశాన్ని పానిక్ చిత్రం అందిస్తోంద‌ని తెలిపారు. వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనున్న ఈ చిత్రాన్ని తెలుగు, బెంగాలీ, హిందీ భాష‌ల‌లో తెర‌కెక్కించ‌నున్న‌ట్లు చెప్పారు.

ద‌ర్శ‌కులు సురంజ‌న్ దే మాట్లాడుతూ.. ఆంధ్రా ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ మ‌రువ‌లేన‌న్నారు. గ‌తంలో ఎఫ్‌టిపీసీ స‌న్మానం సంద‌ర్భంగా విశాఖ‌ప‌ట్నం విచ్చేసిన‌ట్లు తెలిపారు. విశాఖ అందాలు విశేషంగా ఆక‌ట్టుకోవ‌డంతో చిత్ర నిర్మాణాన్ని ఇక్క‌డ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పారు. తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అన్‌ల‌క్కి ష‌ర్ట్‌కు ఏడు అంత‌ర్జాతీయ అవార్డులు ల‌భించాయ‌ని తెలిపారు. రీసెర్చ్ మీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ద్వారా బెంగాలీ మ‌రియు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల సాంస్క్ర‌తిక ఏకీక‌ర‌ణ అభివృద్ధి చెంద‌డం సంతోష‌దాయ‌క‌మ‌న్నారు. ఈ ప‌తాకంపై రిలేష‌న్‌షిప్ మొద‌టి చిత్రం కాగా.. రెండో ప్రాజెక్ట్ బీ కేర్ ఫుల్ అని ఇటీవ‌ల రాజ‌మండ్రిలో షూటింగ్ ముగింపును పూర్తిచేసిన‌ట్లు చెప్పారు. నేటి వాస్త‌వ ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టేలా ఈ మూడో చిత్రం పానిక్‌ను అంత‌ర్జాతీయ ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకుని స‌రికొత్త సాంకేతిక విలువ‌ల‌తో తెర‌కెక్కిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. పానిక్ చిత్రంలో క‌థానాయిక‌లుగా ప్రియాంక బోస్‌, నీలాక్షి సాహా, కాకోలి మండ‌ల్ న‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర క‌థానాయిక‌లు మాట్లాడుతూ.. విశాఖ న‌గ‌రం అందాలు త‌మ‌ను ఎంత‌గానో మురిపించాయ‌ని పేర్కొంటూ విశాఖ న‌గ‌రాన్ని భూత‌ల స్వ‌ర్గంగా అభివ‌ర్ణించారు.

పానిక్ చిత్రంలో ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జ‌య‌శ్రీ, మంతెన మాధ‌వీవ‌ర్మ, సూరిబాబు, హ‌రిలీలా ప్ర‌సాద్‌ మ‌రియు విశాఖ‌కు చెందిన స్థానిక క‌ళాకారులు న‌టిస్తున్నారు. జీవీ ప్రశాంత్ రెడ్డి కెమెరా బాధ్య‌త‌లు, పండిట్ త‌రుణ్ భ‌ట్టాచార్య సంగీతం, మేక‌ప్ పుష్ప యాబాజి బాధ్య‌త‌లు, వ‌హిస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *