Breaking News

పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతా రహితమైన మాటలు తగవు

-మీ పాలన ప్రజల కోసమా.. వ్యాపారుల కోసమా?
-అన్ని రాష్ట్రాలను పిలిచి పన్నులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలి
-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతా రహితమైన మాటలు తగవని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. మీ పాలన ప్రజల కోసమా.. వ్యాపారుల కోసమా? అని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలను పిలిచి సమావేశం ఏర్పాటు చేసి పన్నులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే డీజిల్, పెట్రోల్ పన్నుల పేరుతో సుమారు రూ.30 లక్షల కోట్లు కేంద్రం తీసుకుని ఇప్పుడు రాష్ట్రాలపై పన్నుల భారం మోపడం సరి కాదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చుని పన్నులు తగ్గించే ఆలోచన చేయాలని సూచించారు. మోడీ ప్రభుత్వం వ్యాపారస్తుల కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలని శైలజనాథ్ హితవు పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *