విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ని స్వయం సహాయక సంఘాల అక్క చెల్లమ్మాల జీవన ప్రమాణాలు మెరుగు పరచడంతో పాటుగా మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశం లోని ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని అంబెడ్కర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన మూడో విడత ‘వైయస్ఆర్ సున్నా వడ్డీ’ పధకం నిధుల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై 2,6 డివిజన్లకు సంబంధించి 359 స్వయం సహాయక సంఘాలకు మంజూరు అయిన రూ.41,85,108/- నమూనా చెక్కును డ్వాక్రా మహిళలకు దేవినేని అవినాష్ అందజేశారు. తదనంతరం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి డ్వాక్రా మహిళలు తో కలిసి పాలభిషేకం చేశారు. ఈ సంధర్భంగా అవినాష్ మాట్లాడుతూ అక్కాచెల్లెళ్లకు తోడుగా ఉండే ప్రభుత్వంజగనన్న ప్రభుత్వం అని అన్నారు. వైయస్ఆర్ సున్నా వడ్డీ మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధముగా పని చేస్తూ ప్రజలు చెరువుతున్నారు అని అన్నారు. జగన్ జనరంజక పాలన ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ నాయకులూ ప్రజలకు సంక్షేమ పథకాలను నిలిపివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీ చెల్లిస్తామని చెప్పి సుమారు మూడు వేల కోట్లు ఎగనామం పెట్టేరు అన్ని అన్నారు. నవరత్నాల ద్వారా ఇచ్చిన హామీలనే కాకుండా రాష్ట్రంలో సుమారు 34 సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ దేశంలో ఇంకా ఏ రాష్ట్రంలోను ఎవరు చేయని విధంగా మన రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి అన్ని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను వారి రాష్ట్రంలో అమలు చేస్తున్నారు అన్న విషయం చంద్రబాబు నాయుడు మరియు వారి భజన బృంధం తెలుసుకోవాలని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, 2వ డివిజన్ కార్పొరేటర్ అంభనపూడి నిర్మలా కుమారి, 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ, రాష్ట్రా తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇజ్జాడ తేజేష్, గోవేర్నమెట్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబెర్ ప్రభు, మాజీ కార్పొరేటర్ కోటి నాగులు, వైస్సార్సీపీ నాయకులు సంపత్, చిన్నబాబు, చందా కిరణ్, కనపర్తి బాబు, మొయిన్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News