Breaking News

గడప గడప కి ప్రజల నీరాజనం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నేడు రాష్ట్రంలో ప్రతి మహిళ ముందుకు వస్తున్నారని,వైస్సార్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని,ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 9వ డివిజన్ పటమట చేపల బజార్ నుండి మొదలు పెట్టి గంగానమ్మ గుడి మీదుగా స్క్రూ బ్రిడ్జి వరుకు ఇంటింటికి వెళ్లిన అవినాష్ సంక్షేమ పథకాలు అమలు తీరును, చేస్తున్న అభివృద్ధి ని ప్రజలకు వివరించారు.
అవినాష్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని అన్నారు. శంకుస్థాపన చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం వీలైనంత త్వరగా పూర్తి అయ్యేలా తగు చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్ల కాలంలోనే ఈ డివిజిన్ లో రెండు కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, మరో రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని తెలిపారు. గత ప్రభుత్వం లో ఎమ్మెల్యే, ఎంపీ,కార్పొరేటర్ లు టీడీపీ వారే అయ్యుండి కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి గురుంచి పట్టించుకోలేదని ఎద్దేవాచేశారు.కానీ వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో ఓడిపోయిన సరే పెద్ద ఎత్తున నిధులతో అభివృద్ధి చేస్తున్నామని,టీడీపీ లాగా ఓటు బ్యాంకు రాజకీయాలు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ వల్లూరు ఈశ్వరప్రసాద్, రాష్ట్రా కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గొట్టిపాటి హరీష్, మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు,జిల్లా ఫిషర్ మెన్ సొసైటీ డైరెక్టర్ ఖాళీ, రాష్ట్ర రజక సంఘ అధ్యక్షుడు శివయ్య, స్టాండింగ్ కమిటీ మెంబెర్ తంగిరాల రామిరెడ్డి, మరియు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *