Breaking News

జనసేన నిరంతర పోరాటం వల్లే ముసాఫిర్ ఖానా ప్రారంభోత్సవం…

-ముసాఫిర్ ఖానా వక్ఫ్ బోర్డ్ ఆధీనంలోనే ఉంచి పేద ముస్లిం లకు 5 వేలకు అద్దెకు ఇవ్వాలి VMC నిర్వహణ వద్దు.
-హజ్ హౌస్ పశ్చిమంలో నిర్మించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద ముస్లిం మైనార్టీల సబ్ ప్లాన్ సక్రమంగా అమలు చేయాలని ముసాఫిర్ ఖానా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఉంచి పేద ముస్లిం లకు 5 వేలకు అద్దెకు ఇవ్వాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ వద్దని ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అనుమతి లేదని పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం వద్ద మహేష్ ను మరియు జనసేన పార్టీ నాయకులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ముస్లింల సమస్యల పరిష్కారం ఉద్యమిస్తుంటే ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు, ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమం పట్ల నిజంగా ముఖ్యమంత్రి జగన్ కి చిత్తశుద్ధి ఉంటే ముస్లిం సబ్ ప్లాన్ ను సక్రమంగా అమలు చేయాలని, ముసాఫిర్ ఖానా ను వక్ఫ్ బోర్డ్ ఆధీనంలోనే ఉంచి పేద ముస్లిం లకు ఐదువేల కే అద్దెకు ఇస్తామని, హజ్ హౌస్ ను తిరిగి పశ్చిమ నియోజకవర్గం లోనే నిర్మిస్తామని గాలిబ్ షాహిద్ దర్గా కు చెందిన విలువైన భూములు ఎమ్మెల్యే వెల్లంపల్లి బినామీల నుంచి విడిపించును తర్వాతనే సీఎం జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ నియోజకవర్గం లో కాలు పెట్టాలని డిమాండ్ చేశారు. Cm జగన్  పాలనలో ముస్లింల అభివృద్ధి సంక్షేమం కుంటుపడిందని అందుకు అనేక ఉదాహరణలున్నాయని, వాటిలో ప్రధానంగా పేద ముస్లిం ఆడపిల్లల వివాహ సమయంలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అంశాన్ని గాలికొదిలేశారని, ముస్లిం కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లింపు పూర్తిగా విస్మరించారని, మక్కా యాత్రకు ఆర్థిక సాయం అందించే విషయాన్ని మరచిపోయారని, వక్ఫ్ బోర్డ్ మరియు ముస్లిం మైనార్టీల ఆస్తులను రీ సర్వే చేయించి డిజిటలైజేషన్ చేయించే అంశాన్ని మరచి కబ్జాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, మైనారిటీల స్కాలర్షిప్ లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను నిలుపుదల చేశారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమం పూర్తిగా కుంటుపడిందని ఇటువంటి ప్రభుత్వాన్ని మైనారిటీల వ్యతిరేక ప్రభుత్వామన్నారు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తన బినామీలతో వందల కోట్ల విలువైన గాలిబ్ సాహెబ్ దర్గా భూములు కబ్జా చేశారని వెల్లంపల్లి చెర లో ఉన్న దర్గా భూములను సీఎం జగన్మోహన్ రెడ్డి  విడుదల చేయించాలని, లేనిపక్షంలో సీఎం జగన్ గారు కబ్జాలను ప్రోత్సహించినట్లు అవుతుందని, అదేవిధంగా వెల్లంపల్లి ఊసరవెల్లి రాజకీయాలను సీఎం గ్రహించాలని ,ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ కాజా తాను చైర్మన్ కావాలని సీఎం జగన్  పై కేసులు వేసి నేడు స్వాగత బ్యానర్ల కట్టడం ఊసరవెల్లి రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం కాదా అని, ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్న వెల్లంపల్లి నిజస్వరూపాన్ని ప్రజలు సీఎం గ్రహించాలన్నారు, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మూడు సంవత్సరాల నుంచి నిద్రపోయి మూడు రోజుల కిందటే నిద్ర లేచారని, ముసాఫిర్ ఖానా గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదని, ముసాఫిర్ ఖానా ను అడ్డంపెట్టుకుని ఇల్లు కట్టుకున్న జలీల్ ఖాన్ ముసాఫిర్ ఖానా గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందని, ఈ అంశంపై జలీల్ ఖాన్ ను చూసి ముస్లిం మైనార్టీలు నవ్వుకుంటున్నారని, పశ్చిమ నియోజకవర్గంలో మూడు సంవత్సరాల నుంచి ముస్లిం మైనార్టీ లపై పోరాడుతున్నది కేవలం జనసేన పార్టీ మాత్రమేనని నేడు జనసేన పార్టీ నిరంతరం పోరాటం వల్ల మాత్రమే ముసాఫిర్ ఖానా ప్రారంభోత్సవానికి నోచుకుంటుందని, గతంలో అనేక మార్లు ముసఫిర్ఖాన ను సందర్శించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు మరియ ప్రభుత్వానికి తెలియజేసి పేద ముస్లిం లకు ఉపయోగపడే విధంగా ప్రారంభించాలని డిమాండ్ చేసిన ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్. మోబినా, సయ్యద్ అబ్దుల్ నజీబ్, షేక్. నూర్, మరియు డివిజన్ అధ్యక్షులు మల్లెపు విజయ లక్ష్మి వేంపల్లి.గౌరీ , కొరగంజి. రమణ,బత్తుల. వెంకటేష్,నల్లబెల్లి.కనకారవు,పొట్నూరి.శ్రీను, శిగినంశెట్టి రాము, జల్లి రమేష్, రెడ్డిపల్లి గంగాధర్,సోమి..మహేష్, ఆకుల రవి కుమార్,కంది రాజ,ఏలూరు సాయి శరత్,బొమ్ము రాంబాబు, నగర కమిటీ సభ్యులు గన్ను శంకర్, సానివరపు .శివ,వేవిన నాగరాజు, స్టాలిన్ శంకర్, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు మరియు ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *