-మండు వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు జాప్ ఆధ్వర్యంలో చలివేద్రం ఏర్పాటు…!!
-లాంచనంగా ప్రారంభించిన ఇబ్రహీంపట్నం ఎంపిపి పాలడుగు జ్యోత్స్న….!!!
-బాటసారులకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ…!!!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాసేవలో మేము సైతం అంటూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) జిల్లా అధ్యక్షులు అజయ్ ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో స్టేట్ అధ్యక్షులు పొన్నం రాజు ఆదేశాల మేరకు కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోగల కొత్త గేటు జర్నలిస్ట్ మోడల్ కాలనీ సమీపంలో వేసవి దాహాన్ని తీర్చే ఎందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపిపి పాలడుగు జ్యోత్స్న మరియు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి ప్రసన్న బోస్ హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈరోజు ప్రారంభం మొదటిరోజు నా ఒక్క మగాడు హోటల్ అధినేత వేణు సహకారం తో బాటసారులకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ తరపున ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేసి దాహార్తి నీ తీర్చారు. అనంతరం జర్నలిస్టులను ఉద్దేశించి ఎంపిపి పాలడుగు జ్యోత్స్న మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే జర్నలిస్టులు సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో జాప్ స్టేట్ సభ్యులు ప్రభాకర్ రావు మరియు జిల్లా సభ్యులు వెంకట్, ఇబ్రహీంపట్నం ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, కొండపల్లి ప్రెస్ క్లబ్ సభ్యుడు అడప శివ , కొండపల్లి ప్రెస్ క్లబ్ ఎడ్యుకేటెడ్ రామకృష్ణ, విజయవాడ జర్నలిస్టు సోదరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News