Breaking News

పెన్షన్ల పంపిణీకి అంతా సిద్దం…

-జిల్లాలో 2,20,026 మంది పెన్షన్‌ దారులకు 50.44 కోట్ల రూపాయలు…
-అవ్వాతాతలకు మే 1వ తేదీనే అందించి నూరు శాతం పూర్తి చేయండి…
-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అవ్వాతాతలు, వితంతువులు, ఇతర పెన్షన్‌ దారులందరికి పెన్షన్‌ల పంపిణీ కోసం జిల్లా యంత్రాంగం సిద్దమైంది. పెన్షన్ల పంపిణీలో ఏమాత్రం ఆలస్యం కాకుండా ఆదివారం తెల్లవారుజామునుండే పంపిణీ ప్రారంభించి ,నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆదేశించారు. జిల్లాలో 2,20,026 మంది పెన్షన్‌ దారులకు 50.44 కోట్ల రూపాయలు పంపిణీకి సిద్దం చేశామన్నారు. వీరిలో 1,12,039 మంది అవ్వాతాతలకు 2,500 రూపాయల వృద్దాప్య పెన్షన్‌ని చెల్లిస్తారు. అలాగే 59,987 మంది వితంతువులు, 24,009 మంది విభిన్న ప్రతిభావంతులు, 777 మంది చేనేత కార్మికులు, 3,021 మందికి అభయహస్తం పెన్షన్లు పంపిణీ చేస్తారు. అలాగే 1,263 మంది మత్స్యకారులకు, 9,379 మంది ఒంటరి మహిళలకు, 1,806 మంది కల్లుగీత కార్మికులకు, 134 మంది ట్రాస్స్‌జెండర్స్‌కు, 548 మంది కిడ్నిబాధితులకు, 2,968 మంది డప్పుకళాకారులకు, 3,448 మంది చర్మకారులకు, 420 మంది దీర్ఘకాలిక వ్యాదులతో సతమతమవుతున్న భాధితులకు ఆరోగ్య పెన్షన్లు, 200 మంది కళాకారులకు, 27 మంది మాజీ సైనికులకు పెన్షన్లు చెల్లిస్తారు. జిల్లాలో అన్ని పెన్షన్లు కలిపి 50 కోట్ల 43 లక్షల 46 వేల 100 రూపాయలను లబ్దిదారులకు పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్‌ పెర్కొన్నారు. ఆదివారం తెల్లవారుజామునే వాలంటీర్లు తలుపు తట్టి పెన్షన్లు చెల్లించాలని కలెక్టర్‌ చెప్పారు. మే 1వ తేది ఆదివారం అయినప్పటికి ఏమాత్రం అలస్యం లేకుండా లబ్ధిదారులకు అందించవలసిన పెన్షన్‌ మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలని కలెక్టర్‌ డిల్లీరావు ఆదేశించారు. పెన్షన్‌ కానుక ద్వారా లబ్దిదారులకు అందజేయవలసిన సొమ్మును ఆయా శాఖ నుండి సెర్ఫ్‌ ద్వారా జిల్లాలోని అన్ని గ్రామ సచివాలయ ఖాతాలలో ఇప్పటికే జమ చేయడం జరిగిందని తెలిపారు. సచివాలయ వాలంటీర్లు 1వ తేదీ ఉదయం 6 గంటల కల్ల నేరుగా లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి లబ్దిదారుని నుండి బయోమెట్రిక్‌ సేకరించి పెన్షన్‌ నగదును అందజేయనున్నట్లు కలెక్టర్‌ వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *