Breaking News

8 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా జూలై నాటికి రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం పూర్తి….

-కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో సుమారు 123 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే రిటైనింగ్‌ వాల్‌ పనులను వేగవంతం చేసి జూలై మాసాంతానికి గోడ నిర్మాణం 4 మీటర్ల ఎత్తు పూర్తి చేసి 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదలైనప్పటికి ఎటువంటి ముంపుకు గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. కృష్ణలంక, రామలింగేశ్వరనగర్‌ సమీపంలో కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న రిటైనింగ్‌ వాల్‌ పనులను ఇరిగేషన్‌, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులతో కలిసి శనివారం జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ 2019లో సంభవించిన వరదల వలన ముంపుకు గురి అయిన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన ముఖ్యమంత్రి ముంపును నివారించేందుకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ముంపును నివారించేందుకు రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించవల్సివుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే 1.5 కిలో మీటర్ల పొడవున రిటైనింగ్‌ వాల్‌ నిర్మించేందుకు అవసరమైన 123 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి పనులను ప్రారంభానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులను సంబంధిత అధికారులు నిర్థేశించిన లక్ష్యాల మేరకు పూర్తి చేస్తున్నారన్నారు. 3 అడుగుల వ్యాసంతో 18 మీటర్ల లోతుతో ఫైల్‌ రాఫ్ట్‌ పునాదులపైన 8.9 మీటర్ల ఎత్తైౖన కాంక్రీట్‌ గోడను రెండున్నర మీటర్ల వెడల్పుతో 1.5 కీలో మీటర్ల పొడవున నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 65 శాతం వరకు పనులు పూర్తి అయిన్నట్లు ఆయన తెలిపారు. మిగిలిన పనులు జూలై మాసాంతానికి 4 మీటర్ల ఎత్తున గోడ నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికబద్దంగా పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. రానున్న ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాలలో వర్షాలు సంభవించి కృష్ణానదీకి 8 లక్షల వరకు వరద నీరు చేరినప్పటికి పరివాహక ప్రాంతాల వారు ఎటువంటి వరద నీటి ముంపుకు గురి కాకుండా ఈ రిటైనింగ్‌ వాల్‌ రక్షణగా నిలుస్తుందని కలెక్టర్‌ తెలిపారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టే 524 ఇళ్లకు సంబంధించిన గృహాలను తొలగించి వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని ఇల్లు తొలగించిన వారికి వాంబే కాలనీలో గృహాలు మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు. గోడ నిర్మాణ ఎలైన్‌ మెంట్‌లో మరి కొందరి ఇళ్లను తొలగించడం జరిగిందని వారి జాబితాను రెవెన్యూ అధికారులు సిద్దం చేస్తున్నారని అర్హులైన ప్రతీ ఒక్కరికి గృహాలు మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. రిటైనింగ్‌ వాల్‌ పూర్తి చేయడం వలన కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో దాదాపు 30 వేల కుటుంబాలు ముంపు బారిన పడకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ వివరించారు. రిటైనింగ్‌ వాల్‌ పనుల పరిశీలినలో జిల్లా కలెక్టర్‌ వెంట నీటిపారుదల శాఖ కెసి డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కె. స్వరూప్‌ కుమార్‌, వియంసి ఇఇ ఏఎస్‌ ఎన్‌ ప్రసాద్‌, డిప్యూటి సీటీ ప్లానర్‌ జూబెన్‌, అర్భన్‌ తహాశీల్థార్‌ వి. శ్రీనివాసరావు, రివర్‌ సెంట్రల్‌ సెక్షన్‌ ఆఫీసర్లు ప్రభుతేజ, శ్రీనివాస్‌, సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *