గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడలోని టిడ్కో ఇళ్లు, జగనన్న లేఅవుట్లను జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం బొమ్ములూరు సమీపంలోగల నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లు, మల్లయ్యపాలెం – గుడివాడ రూరల్, అర్బన్ జగనన్న లేఅవుట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను గురించి ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫేజ్ 1 లో 3,296 టిడ్కో ఇళ్లు పూర్తయ్యాయని ఆయనకు తెలిపారు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్, మంచి నీటి కోసం పైప్ నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పన జూన్ నాటికి పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఫేజ్ 2 లో 5,616 ఇళ్ల నిర్మాణాలకు పనులు చేపట్టినట్టు అధికారులు ఆయనకు తెలిపారు. నవంబరు 15 కల్లా ఫేజ్ 2 ఇళ్ల నిర్మాణాలు సైతం పూర్తి చేయాలని, సైట్ నుంచి గుడివాడ మెయిన్ రోడ్డుకు సీసీ రోడ్డు నిర్మించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన పక్కనే ఉన్న మల్లయపాలెం – గుడివాడ రూరల్, అర్బన్ జగనన్న లేఅవుట్లను పరిశీలించారు. నాన్ స్టార్టెడ్ దశ నుంచి బిబిఎల్ దశ వరకు ఉన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. సైట్ లో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కొన్ని ఇళ్ల నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు వారాల్లోగా మిగిలిన ఇళ్ల నిర్మాణాలు సైతం చేపట్టే విధంగా లబ్దిదారులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి బిల్లులు సత్వరమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. గుడివాడ ఆర్డీవో పి పద్మావతి, హౌసింగ్ పిడి రామచంద్రన్, టిడ్కో ప్రాజెక్ట్ అధికారి బి. చిన్నోడు, గుడివాడ ఎంపిడిఓ వెంకట రమణ, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, డి ఈ బాలాజీ నాయక్, ఏఈ లు, ఇతర అధికారులు కలెక్టర్ తో పాటు ఉన్నారు
Prajavartha Online Telugu News