-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
17వ డివిజన్ రాణిగారి తోటలో సుమారు రూ.20 లక్షల అంచనాలతో చేపట్టిన నగరపాలక సంస్థ కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ పనులను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంలో మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా ఈ ప్రాంతములో నివశించు సామాన్య ప్రజలు చిన్న చిన్న కార్యక్రమములు నిర్వహించుకొనుటకు సరైన కళ్యాణ మండపాలు లేక ఇబ్బంది పడుతున్న విషయాని దేవినేని అవినాష్ అద్వర్యంలో స్థానిక కార్పొరేటర్ కోరిన దానిపై రూ. 20 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టినట్లు వివరించారు. 17, 18 మరియు 19 డివిజన్ ప్రాంత వాసులు ఏదైనా కార్యక్రమములు నిర్వహించుకొనుటకు వీలుగా కమ్యూనిటీ హాల్ నందు అవసరమగు అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావటం జరుగుతుందని అన్నారు. రాబోవు రోజులలో షెడ్ ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి స్థాయిలో వివాహాలు కూడా నిర్వహించుకొనుటకు వీలుగా కమ్యూనిటీ హాలును తిర్చిదిద్దుట జరుగుతుందని అన్నారు.
అభివృద్ధియే లక్ష్యంగా వై.సి.పి పాలన .. దేవినేని అవినాష్
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధియే లక్ష్యంగా వై.సి.పి ప్రభుత్వం పని చేస్తుందని, ఎంతో కాలంగా ఈ ప్రాంత వాసులు ఎదురు చూస్తున్న కళ్యాణ మండపం రాబోవు రోజులలో అన్ని సౌకర్యాలను సమకూర్చి అనేక శుభాకార్యక్రమములకు అనుగుణంగా తీర్చి దిద్దుటం జరుగుతుందని అన్నారు. మేయర్ భాగ్యలక్ష్మి సహకారంతో నియోజకవర్గoలోని అన్ని డివిజన్ లలో అనేక అభివృద్ధి కార్యక్రమములకు శ్రీకారం చుట్టి వాటిని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని, దీనిని కూడా అతి సమయంలో సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. కార్యక్రమములో వై.సి.పి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News